శ్రీవారి దర్శనం .. ఎన్ఆర్ఐ భక్తులకు టీటీడీ శుభవార్త , ఆ కోటా భారీగా పెంపు

ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ఆలయం, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడు కొలువైయున్న తిరుమల తిరుపతి దేవస్థానం ( Tirumala Tirupati Devasthanam )అంతర్జాతీయంగా ఖ్యాతి పొందింది.

ప్రతిరోజూ లక్షలాది మంది భక్తులు ఎన్నో వ్యయ ప్రయాసకోర్చి శ్రీవారిని దర్శిస్తుంటారు.భక్తుల రాకతోనే కాదు, సంపద విషయంలోనూ తిరుమల ఆలయం ఎప్పటికప్పుడు కొత్త రికార్డులు సృష్టిస్తూనే ఉంది.

అలాగే సంపన్నులు స్వామి వారికి భూరి విరాళాలతో పాటు కోట్ల విలువైన ఆభరణాలను బహుకరిస్తుంటారు.

రోజురోజుకు శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతుండటంతో వారికి దర్శనం, బస వంటి ఏర్పాట్లు చేయడం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి కష్టమవుతోంది.

దీనికి తోడు బ్రేక్ దర్శనాలు, సిఫారసు లేఖలతో టీటీడీ సతమతమవుతోంది.స్వామి వారిని దర్శించుకునేందుకు రకరకాల టికెట్లు అందుబాటులో ఉన్నాయి.

ఉచిత దర్శనం నుంచి విరాళాలు అందించే వారికి దర్శనం వరకు పలు విధానాలు అందుబాటులో ఉన్నాయి.

"""/" / ఈ క్రమంలోనే విదేశాలలో ఉండేవారు, ఎన్ఆర్ఐలకు( NRIs ) తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది.

ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ ( Andhra Pradesh Non Resident Telugu Society )(ఏపీ ఎన్ఆర్‌టీఎస్) సభ్యులకు ఇచ్చే వీఐపీ బ్రేక్ దర్శనం కోటాను పెంచుతూ టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది.

ఇప్పటి వరకు ఏపీఎన్ఆర్‌టీఎస్ సభ్యులకు ప్రతి రోజు 50 వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లను జారీ చేస్తున్నారు.

దీనిని రెట్టింపు చేసిన నేపథ్యంలో ఇకపై వీటీ సంఖ్య 100కు పెరగనున్నాయి.

ఈ మేరకు టీటీడీ డిప్యూటీ ఈవో ఎం లోకనాథం ( TTD Deputy EO M Lokanatham )ఉత్తర్వులు జారీ చేశారు.

ఆంధ్రప్రదేశ్ సాధారణ పరిపాలన శాఖ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు లోకనాథం తెలిపారు.

"""/" / ఇకపోతే.మార్చి నెల శ్రీవాణి టికెట్ల కోటాను గతేడాది డిసెంబర్ 25న ఉదయం 11 గంటలకు , మార్చి నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను డిసెంబర్ 26న టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేసిన సంగతి తెలిసిందే.

అదే రోజు సాయంత్రం 3 గంటలకు తిరుమలలోని వసతి గదుల కోటాను కూడా విడుదల చేసింది.