లడ్డు వివాదం : నేడు తిరుపతికి సిట్ బృందం 

తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీలో కల్తీ జరిగిందనే విషయం బయటకు వచ్చిన దగ్గర నుంచి దీనిపై పెద్ద రాజకీయ దుమారమే జరుగుతోంది.

ముఖ్యంగా టిడిపి, జనసేన, బిజెపిలు వైసీపీని టార్గెట్ చేసుకుని తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నాయి.

గత వైసిపి ప్రభుత్వ హయాంలోనే కల్తీ నెయ్యి సరఫరా జరిగిందని టిడిపి కూటమి పార్టీలు విమర్శలు చేస్తున్నాయి.

ఈ వివాదం సంచలనంగా మారడంతో ప్రభుత్వం దీనిపై పూర్తిస్థాయిలో విచారణకు సీట్ బృందాన్ని ఏర్పాటు చేసింది .

ఈ మేరకు రంగంలోకి దిగిన సీట్ బృందం ఈరోజు తిరుపతి లో( Tirupati )  విచారణ నిర్వహించనున్నారు.

సిట్ బృందం( SIT ) ఎవరిని ప్రశ్నిస్తారు ?  ఎవరిపై కేసులు నమోదు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.

"""/" / తిరుమల శ్రీవారి ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిన రిపోర్టు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

దీనిపై నిజా నిజాలను తేల్చాలి అని ప్రభుత్వం పై ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో,  9 మంది సభ్యులతో కూడిన సీట్ బృందాన్ని ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూలో( Tirumala Laddu Prasadam ) జంతువుల కొవ్వు కలిసిన రిపోర్టు రోజుకు వివాదాస్పదం అవుతున్న నేపథ్యంలో,  దీనికి కారకులైన వారికి శిక్ష పడే విధంగా చర్యలకు దిగుతోంది.

  ఈ మేరకు తొమ్మిది మంది సభ్యులతో కూడిన సిట్ బృందాన్ని ఏర్పాటు చేశారు .

డీఐజీ సర్వ శ్రేష్ట త్రిపాఠి( DIG Sarva Sreshta Tripathi ) ఈ టీమ్ కు నేతృత్వం వహించనున్నారు.

ఈరోజు నుంచి పూర్తిస్థాయిలో విచారణ నిర్వహించనున్నారు. """/" / లడ్డు ప్రసాదంలో నెయ్యి కల్తీపై పూర్తిస్థాయిలో విచారించనున్నారు .

ముందుగా ఏఆర్ డైరీ పై( A.R Dairy ) నమోదైన కేసుకు సంబంధించి విచారణ నిర్వహించనున్నారు.

ఇప్పటికే డిజిపి తో సమావేశం అయిన ఈ బృందం విచారణ చేయాల్సిన అంశాల పైన చర్చించింది.

గత వైసీపీ ప్రభుత్వ హయంలో తిరుమలకు నెయ్యిని ఎక్కడెక్కడ నుంచి కొనుగోలు చేశారు,  టెండర్లు ఎవరెవరికి ఇచ్చారు , ఆ కంపెనీల లావాదేవీలు ఏమిటి ? దీంట్లో ఎవరు కీలకపాత్ర పోషించారు వంటి అన్ని అంశాల పైన సీట్ బృందం సమగ్రంగా విచారణ చేయనుంది.

అలాగే నెయ్యి నాణ్యత పై గతంలోనూ , ఈ మధ్యకాలంలోనూ వచ్చిన రిపోర్టులను పరిశీలించనున్నారు.

టెండర్ల వ్యవహారంలో ఈవో , మాజీ చైర్మన్ లను కూడా విచారించే అవకాశం కనిపిస్తోంది.

వీడియో: పేరెంట్స్ ఇచ్చిన బర్త్‌డే గిఫ్ట్‌ చూసి కొడుకు అదిరిపోయే రియాక్షన్..