శ్రీవారి భక్తులకు గమనిక.. ఈ రోజు అంగ ప్రదిక్షిణం టోకెన్ల విడుదల..

శ్రీవారి భక్తులకు తిరుమల దేవస్థానం ముఖ్య అప్డేట్ ను ఇచ్చింది.నిత్యం లక్షలాదిమంది భక్తులు తిరుమలకు రావడమే కాకుండా వేరువేరు సేవలలో పాల్గొంటూ ఉంటారు.

వీరి కోసం ప్రత్యేకంగా టికెట్లను తిరుమల దేవస్థానం విడుదల చేస్తుంది.తాజాగా అంగప్రదక్షిణ సేవకు సంబంధించిన టికెట్లను విడుదల చేసింది.

ఫిబ్రవరి 11వ తేదీన అంగప్రదిక్షణం టోకెన్లు కూడా విడుదల చేశారు.మార్చి నెలకు సంబంధించిన టోకెన్లు అందుబాటులోకి వచ్చాయి.

అంతే కాకుండా గత నెల 23 నుంచి 28 తేదీ వరకు విడుదల చేయని కోటను ఫిబ్రవరి 11వ తేదీన ఉదయం 11 గంటలకు టిటిడి ఆన్లైన్లో విడుదల చేసింది.

భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఆన్లైన్ లో టోకెన్లు బుక్ చేసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్య అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు.

టోకెన్లు బుక్ చేసుకునేందుకు Ttdsevaonline!--com లో రిజిస్టర్ చేసుకోవాలి. """/" / సైట్లో సైన్ అప్ చేయాలి.

లింక్ క్లిక్ చేశాక అకౌంట్ యాక్టివేట్ అవుతుంది.ఆ తర్వాత లాగిన్ పేజీకి వెళ్తుంది.

లాగిన్ తర్వాత తేదీలు అందుబాటులో ఉంటాయి.డాష్ బోర్డును చూసి మీ తేదీని సెలెక్ట్ చేసుకోవడం మంచిది.

ఆ తర్వాత ఖాళీగా ఉన్నా స్లాట్ ను చెక్ చేసుకునీ ఏ తేదీలలో ఖాళీ ఉంటే ఆ గుర్తు ఆకుపచ్చ రంగులు కనిపిస్తుంది.

"""/" / ఆ తర్వాత అక్కడ ప్రెస్ చేసి టికెట్ మొత్తానికి డబ్బులు చెల్లిస్తే సరిపోతుంది.

మీకు టికెట్ బుక్ అవుతుంది.సాధారణంగా ఇతర వెబ్సైట్లో చేసిన విధంగానే ఉంటుంది.

ఒక వేళ మీకు ఎక్కువ లడ్డులు కావాలంటే కూడా ఇక్కడ బుక్ చేసుకోవచ్చు.

వీడియో: రైల్వే ట్రాక్‌పై స్పృహ తప్పి పడిపోయిన వ్యక్తి.. చివరికి ఏమైందో చూడండి..