డబ్బులుంటేనే అమెరికాలో బతకగలరు.. యూఎస్ కంటే ఇండియానే బెటర్.. యూఎస్ ఫౌండర్ పోస్ట్ వైరల్..

డబ్బులుంటేనే అమెరికాలో బతకగలరు యూఎస్ కంటే ఇండియానే బెటర్ యూఎస్ ఫౌండర్ పోస్ట్ వైరల్

అమెరికాలో( America ) బతకడం భరించలేనంత ఖరీదైపోయింది.దీంతో విసిగిపోయిన ఎల్లియట్ రోసెన్‌బర్గ్( Elliot Rosenberg ) అనే అమెరికన్ పౌరుడు తొమ్మిదేళ్ల కిందట సంచలన నిర్ణయం తీసుకున్నాడు.

డబ్బులుంటేనే అమెరికాలో బతకగలరు యూఎస్ కంటే ఇండియానే బెటర్ యూఎస్ ఫౌండర్ పోస్ట్ వైరల్

ఉన్న ఊరు వదిలి, దేశం దాటి బతకడం మొదలుపెట్టాడు.ఇప్పుడు గోవాలో( Goa ) తన భార్య, పిల్లలతో హాయిగా ఉంటున్నాడు.

డబ్బులుంటేనే అమెరికాలో బతకగలరు యూఎస్ కంటే ఇండియానే బెటర్ యూఎస్ ఫౌండర్ పోస్ట్ వైరల్

నెలకి లక్ష రూపాయలు కూడా ఖర్చు లేకుండా లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు ఈయన.

ఇటీవల లింక్డ్‌ఇన్‌లో తన స్టోరీ షేర్ చేశాడు రోసెన్‌బర్గ్.పన్నెండేళ్ల క్రితం ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, రిటైర్ ఎర్లీ ( FIRE ) రూల్స్ ఫాలో అయ్యానని చెప్పాడు.

అంటే ఖర్చులు తగ్గించుకోవడం, ఇన్వెస్ట్‌మెంట్లు చేయడం, రకరకాల ఆదాయ మార్గాలు వెతుక్కోవడం అన్నమాట.

కానీ అమెరికాలో మాత్రం ఇవన్నీ చేయడం చాలా కష్టంగా అనిపించిందట.ద్రవ్యోల్బణం ఒకవైపు మంట పెడుతుంటే, ‘లైఫ్‌స్టైల్ క్రీప్’( Lifestyle Creep ) అనే ఇంకో ఖర్చుల భూతం పట్టుకుందట.

ఫ్రెండ్స్‌తో తిరగడానికి, షాపింగ్‌లకి, పార్టీలకి విపరీతంగా డబ్బులు ఖర్చు చేయాల్సి వచ్చేది. """/" / దీంతో విసిగిపోయి అమెరికాకు టాటా చెప్పేశాడు రోసెన్‌బర్గ్.

మొదట బ్రెజిల్ వెళ్లాడు.ఆ తర్వాత సౌత్ ఏషియా దేశాలు చుట్టేశాడు.

చివరికి ఇండియాలో( India ) గోవా ఫిక్స్ అయిపోయాడు.ఇక్కడే ప్రేమ దొరికింది, పెళ్లి చేసుకున్నాడు, భార్య ఫ్యామిలీతో కలిసిపోయాడు.

హిందీ నేర్చుకున్నాడు, లైఫ్‌లాంగ్ ఫ్రెండ్స్‌ని సంపాదించుకున్నాడు.అంతేనా, ఇండియాలోనే రెండు బిజినెస్‌లు స్టార్ట్ చేసి సెటిల్ అయిపోయాడు.

ఇప్పుడు ఫైనాన్షియల్‌గా స్టేబుల్‌గా ఉన్నాడు, హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నాడు. """/" / తన పోస్ట్‌లో తన లైఫ్‌స్టైల్ చాలా తక్కువ ఖర్చుతో, చాలా హ్యాపీగా ఉందని చెప్పాడు రోసెన్‌బర్గ్.

చాలామంది లింక్డ్‌ఇన్ యూజర్స్ అతడిని మెచ్చుకున్నారు.రిస్క్ తీసుకునే ధైర్యం ఉందని ఒకరు కామెంట్ చేస్తే, ఇండియాలో హ్యాపీగా, సేఫ్‌గా ఉండొచ్చని తెలిసి హ్యాపీగా ఉందని ఇంకొకరు అన్నారు.

వర్జీనియా యూనివర్సిటీలో కామర్స్, లాటిన్ అమెరికన్ స్టడీస్ చదివిన రోసెన్‌బర్గ్, ఇండియాలో కొత్త జీవితాన్ని స్టార్ట్ చేసి సక్సెస్ అయ్యాడు.

బోల్డ్ డెసిషన్స్ తీసుకుంటే ఊహించని రిజల్ట్స్ వస్తాయని ప్రూవ్ చేశాడు ఈయన.

కన్నప్ప రిలీజ్ వాయిదా.. వాళ్లకు క్షమాపణలు చెప్పిన హీరో మంచు విష్ణు!

కన్నప్ప రిలీజ్ వాయిదా.. వాళ్లకు క్షమాపణలు చెప్పిన హీరో మంచు విష్ణు!