అలనాటి టిప్పు సుల్తాన్ ఖడ్గం ఖరీదు ఈరోజు రూ.140 కోట్లు?

టిప్పు సుల్తాన్.( Tipu Sultan ) గురించి చిన్నప్పుడు అందరూ చదువుకొనే వుంటారు.

టిప్పూ సుల్తాన్ పూర్తి పేరు సుల్తాన్ ఫతే అలి టిప్పు.మైసూరు పులిగా టిప్పు సుల్తాన్ ప్రసిద్దికెక్కాడు.

హైదర్ అలీ 2వ భార్య ఫక్రున్నీసాల ప్రథమ సంతానం టిప్పు సుల్తాన్.టిప్పుకి యుద్ధ వీరుడిగానే కాకుండా మంచి కవిగా కూడా పేరు వుండేది.

ఫ్రెంచ్ వారి కోరిక మేరకు మైసూరులో( Mysore ) మొట్టమొదటి చర్చి నిర్మించిన ఘనత ఇతనిదే.

1782లో జరిగిన 2వ మైసూరు యుద్ధంలో తండ్రికి కుడిభుజంగా ఉండి బ్రిటీషువారిని సైతం ఓడించిన ఘనత టిప్పు సుల్తాన్ కే దక్కింది.

"""/" / ఇకపోతే, అతని తండ్రి హైదర్ అలీ( Hyder Ali ) అదే సంవత్సరంలో మరణించడం ఆయన జీవితంలోని పెద్ద దెబ్బ అని చెప్పుకోవచ్చు.

రెండో మైసూరు యుద్ధం ముగిసిన తరువాత 1799 వరకు టిప్పుసుల్తాన్ మైసూరు సంస్థానమునకు రాజుగా కొనసాగినాడు.

అయితే తరువాతికాలంలో 3వ, 4వ మైసూరు యుద్ధంలో బ్రిటీషు వారి చేతిలో టిప్పు సుల్తాన్ ఘోర ఓటమి పాలయ్యాడు.

దానికి కారణం.బ్రిటీష్ వారికి మరాఠా, గోల్కొండ నిజాం జత కట్టారు.

ఇక టిప్పు సుల్తాన్ ఫ్రెంచ్ వారి అరా కొరా సాయంతో పోరాడడంతో అక్కడ భంగపాటు తప్పలేదు.

"""/" / ఇక అసలు విషయంలోకి వెళితే, అప్పటి టిప్పు సుల్తాన్‌ ఖడ్గం( Tipu Sultan Sword ) ఇపుడు తాజాగా లండన్‌లో వేలం వేయగా, రూ.

140 కోట్లకు అమ్ముడుపోయింది.ఆక్షన్ హౌస్ బొంహమ్స్ ఈ ఆక్షన్‌ని ఆర్గనైజ్ చేయగా అంచనా వేసిన దానికంటే 7 రెట్లు ఎక్కువ మొత్తానికే అమ్ముడుపోయినట్టు ఆ కంపెనీ తాజాగా వెల్లడించింది.

ఇది టిప్పు సుల్తాన్‌కి బాగా నచ్చిన ఖడ్గమని, ఆయన వాడిన ఆయుధాల్లో ఇది అత్యంత కీలకమైందని తెలుస్తోంది.

ఇజ్రాయెల్ , పాలస్తీనా అనుకూల నిరసనలు : స్నాతకోత్సవాన్ని రద్దు చేసిన కొలంబియా యూనివర్సిటీ