కూరల్లో ఉప్పు, కారం ఎక్కువైందా..‌ డోంట్ వర్రీ ఈ సింపుల్ చిట్కాలతో సరి చేసేయండి!

నిత్యం మనం ఎన్నో రకాల కూరలు వండుకుంటూ ఉంటాము.రైస్ తిన్నా, రోటి తిన్నా కూర మాత్రం కచ్చితంగా ఉండాల్సిందే.

రోజుకు ఒక కూర వండుకునే వారు ఉన్నారు.మరియు రెండు మూడు కూరలు వండుకునే వారు ఉన్నారు.

అయితే ఒక్కోసారి తెలియకుండానే కూరలో ఉప్పు లేదా కారం ఎక్కువ వేస్తూ ఉంటారు.

ఆ రోజు ఇంట్లో పెద్ద యుద్ధమే జరుగుతుంది.నిత్యం ఎంత టేస్టీగా వండినా పట్టించుకోని కుటుంబ సభ్యులు ఒక్కరోజు కూరలో ఉప్పు, కారం ఎక్కువైందంటే చిర్రుబుర్రులాడిపోతుంటారు‌.

పైగా ఆ రోజు కూర మొత్తం డస్ట్ బిన్ లోకి చేరుతుంది.ఇలాంటి సందర్భాలు మీ ఇంట్లో జరిగాయా.

అయితే ఇకపై కూరల్లో ఉప్పు లేదా కారం( Salt Or Pepper ) ఎక్కువ అయినప్పుడు అస్సలు వర్రీ అవ్వకండి.

ఇప్పుడు చెప్పబోయే సింపుల్ చిట్కాలతో కూరను టేస్టీగా మార్చేయండి.కూర కారంగా ఉంటే అస్సలు నోట్లో పెట్టలేము.

అలాంటి సమయంలో మనకు టమాటో( Tomato ) బాగా సహాయపడుతుంది.కూరలో అధిక కారాన్ని టమాటో తగ్గించేస్తుంది.

ఒక టమాటోను తీసుకుని నాలుగు ముక్కలుగా కట్ చేసి కూరలో వేసి మరోసారి కుక్ చేయండి.

ఇలా చేశారంటే కూరలో కారం తగ్గి టేస్టీగా మారుతుంది. """/" / అలాగే కూరలో ఉప్పు లేదా కారం ఎక్కువైనప్పుడు బ్రెడ్ ముక్కలు ( Bread Slices )వేసి కాసేపు వదిలేయాలి.

బ్రెడ్ ముక్కలు కూరలో ఉప్పు, కారాన్ని పీల్చుకుంటుంది.దీంతో కూర రుచికరంగా మారుతుంది.

కూరలో ఉప్పు బాగా ఎక్కువ ఉన్నప్పుడు కొన్ని ఉల్లిపాయ ముక్కలను( Onion Slices ) నూనెలో వేయించి కూరలో కలపాలి.

ఇలా చేయడం వల్ల ఉప్పదనం పూర్తిగా తగ్గుతుంది. """/" / అలాగే కూరల్లో కారం ఎక్కువగా ఉంది అనిపిస్తే అందులో ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్లు లెమన్ జ్యూస్( Lemon Juice ) కలపండి.

లెమన్ జ్యూస్ కారాన్ని చంపేస్తుంది.కూరను టేస్టీగా మారుస్తుంది.

కూరలో కారం లేదా ఉప్పును లెవెల్ చేయడంలో బంగాళదుంప కూడా సహాయపడుతుంది.నాలుగు బంగాళదుంప ముక్కలను కూరలో వేసి ఉడికించారంటే ఎక్కువైనా ఉప్పు లేదా కారం బ్యాలెన్స్ అయిపోతుంది.

క్రిస్మస్ స్టాకింగ్‌లో లాటరీ టికెట్.. ఒక్క రాత్రిలో కోటీశ్వరురాలైంది..!