ఒళ్ళు నొప్పులు తగ్గేందుకు చిట్కాలు..!

ఎముకల బలం తగ్గడంతో ఒళ్ళు నొప్పులు వస్తుంటాయి.అంతేకాకుండా వయసు పైబడే కొద్దీ, కొన్ని వ్యాయామాలు చేసినప్పుడు బాడీ పెయిన్స్ ఎక్కువగా వస్తుంటాయి.

ఇక ఇంట్లో ఎక్కువగా బాధించే విషయం ఒళ్ళు నొప్పులు.ఒళ్ళు నొప్పులు రావడం సహజం.

అయితే చాల మంది ఈ నొప్పుల నుండి ఉపశమనం పొందడం కోసం మాత్రలను వేసుకుంటూ ఉంటారు.

అయితే అది తాత్కాలికంగా ఉపశమనం కలిగిస్తుంది.అంతేకాకుండా మరలా ఇదే పరిస్థితి తలెత్తడంతో ఇబ్బందులు పెడుతుంది.

అంతేకాకుండా రోజు ట్యాబ్లేట్స్ తీసుకోవడం వలన ఆరోగ్యం క్షిణిస్తుంది.అంతేకాకుండా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా బాడీ పెయిన్స్ నుండి ఉపశమనం పొందడానికి ఇంటి చిట్కాలు పాటించడం వలన మంచిదని నిపుణులు తెలిపారు.

అయితే అవి ఏంటో ఒక్కసారి చూద్దామా.మనం వంటగదిలో ఉపయోగించే యాపిల్ సైడర్ వెనిగర్ ను కొంచెం నీళ్లలో వేసుకొని, అందులో కొంచెం తేనే కలుపుకొని తాగాలని అన్నారు.

అంతేకాకుండా స్నానం చేసే నీళ్లలో కూడా యాపిల్ సైడర్ వెనిగర్ ని కలిపి స్నానం చేసుకుంటే ఒళ్ళు నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చును.

ఇక ఐస్ ముక్కలను నొప్పి ఉండే భాగంలో పెడితే నొప్పులు తగ్గుతాయని తెలిపారు.

ఇక దాల్చిన చెక్క పౌడర్ ను నీళ్లలో కలిపి, అందులో కొంచెం తేనే కలిపి తాగడం వలన ఒళ్ళు నొప్పులు తగ్గుతాయని అన్నారు.

ఇక ప్రతిరోజూ రెండు లేదా మూడు అరటిపండ్లను తినడం వలన ఒళ్ళు నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చును.

మూవీ కోసం గుండు గీయించుకున్న సుకుమార్ కూతురు.. కష్టానికి ఫిదా అవ్వాల్సిందే!