అధిక బరువు తగ్గడానికి ఇప్పటివరకు ఎవరు చెప్పని చిట్కాలు..
TeluguStop.com
ఈ మధ్యకాలంలో చాలామంది ప్రజలు అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు.అయితే ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరీ శరీరం సన్నగా, ఫిట్ గా ఉండాలని ఇష్టపడుతుంటారు.
అంతేకాకుండా ఆధునిక జీవనశైలి కారణంగా చాలామంది ప్రజలు ఈ అధిక బరువు వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.
దీంతో శరీరం లావుగా ఉంటే అందంగా తయారయ్యే అవకాశం కూడా ఉండదు.ఈ బరువును తగ్గించుకోవడానికి చాలా మంది జిమ్లలో వెళ్లి కసరతూలు చేస్తున్నారు.
ఇంకొంతమంది అయితే భారీ వర్కౌట్స్ చేసి లేనిపోని ఆరోగ్య సమస్యలను తెచ్చుకుంటున్నారు.అయితే శరీర బరువును తగ్గించుకోవడానికి ఇప్పటినుంచి ఇలాంటి వాటిని చేయనక్కర్లేదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
కొన్ని ఇంటి చిట్కాలతోనే సులభంగా బరువును తగ్గించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.అయితే ఎలాంటి ఇంటి చిట్కాలో ఇప్పుడు తెలుసుకుందాం.
తేనె,నిమ్మ రసం శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.ఇందులో ఉండే గుణాలు శరీర బరువును తగ్గించేందుకు ఎంతగానో ఉపయోగపడతాయి.
ముఖ్యంగా నిమ్మలో ఉండే పోషకాలు శరీరంలో కొలెస్ట్రాలను తగ్గించడానికి ఎంతగానో ఉపయోగపడతాయి.కాబట్టి గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం తేనె కలుపుకొని తాగడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.
జీలకర్ర నీరు శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను కలిగిస్తుంది.అంతేకాకుండా ఇందులో ఉండే ఔషధా గుణాలు అధిక పరిమాణంలో శరీరానికి లభిస్తాయి.
"""/"/
కాబట్టి శరీరాన్ని అనారోగ్య సమస్యల నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది.కాబట్టి ప్రతిరోజు జీలకర్ర ను నీటిలో నానబెట్టి తాగడం కూడా మంచిదే.
పెరుగులో శరీరానికి కావాల్సిన మంచి బాక్టీరియా ఉంటుంది.కాబట్టి ఆహారం తినేటప్పుడు పెరుగును కచ్చితంగా తీసుకోవడం వల్ల బరువును సులభంగా తగ్గుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ప్రతిరోజు పెరుగు తినడం వల్ల జీర్ణ వ్యవస్థ సమస్యలు కూడా దూరమవుతాయి.
ఆ డైరెక్టర్లతో ప్లాన్ చేయొచ్చుగా బాలయ్యా.. మోక్షజ్ఞ విషయంలో ఇలా చేయడం రైటా?