వ‌ర్కౌట్స్ చేసేవారు ఇవి పాటించ‌కుంటే..స్కిన్‌కి చాలా డేంజ‌ర‌ట‌‌!

నేటి అధునిక కాలంలో ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండేందుకు రెగ్యుల‌ర్‌గా వ‌ర్కౌట్స్ చేసే వారు ఎంద‌రో.

వ‌ర్కౌట్స్ చేయ‌డం వ‌ల్ల శ‌రీర బ‌రువు అదుపులో ఉండ‌ట‌మే కాదు.గుండె వ్యాధులు, మ‌ధుమేహం, ర‌క్త పోటు, క్యాన్స‌ర్ వంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌చ్చే రిస్క్ కూడా త‌గ్గుముఖం ప‌డుతుంది.

ఒత్తిడి, ఆందోళ‌న వంటి స‌మ‌స్య‌లు కూడా దూరం అవుతాయి.అందుకే నిపుణులు కూడా అంద‌రినీ వ‌ర్కౌట్స్ చేయ‌మ‌ని చెబుతుంటారు.

అయితే వ‌ర్కౌట్స్ చేసేట‌ప్పుడు చాలా మంది ముఖ‌చ‌ర్మం విష‌యంలో అజాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రిస్తుంటారు.ఫ‌లితంగా ముఖంలో ఉండే కాంతి క్షీణిస్తుంది.

అందుకే వ‌ర్కౌట్స్ చేసేవారు ఖ‌చ్చితంగా కొన్ని జాగ్ర‌త్త‌లు పాటించాలి.ముఖ్యంగా కొంద‌రు మేక‌ప్‌తోనే వ‌ర్కౌట్స్ చేస్తుంటారు.

కానీ, ఇలా చేయ‌డం వ‌ల్ల స్కిన్‌కి చాలా డేంజ‌ర‌ని నిపుణులు చెబుతున్నారు.మేక‌ప్‌లో ఉండే కెమిక‌ల్స్ చెమ‌ట‌తో క‌లిసి రియాక్ష‌న్ చూపిస్తాయి.

దాంతో చ‌ర్మంపై ప‌గుళ్లు, మొటిములు వంటివి ఏర్ప‌డ‌తాయి. """/"/ అందుకే వ‌ర్కౌట్ చేసే ముందు త‌మ చ‌ర్మానికి సెట్ అయ్యే క్లీన్సర్‌తో మేక‌ప్ మొత్తాన్ని తొలిగించుకోవాలి.

ఆ త‌ర్వాత ముఖానికి నాణ్య‌మైన మాయిశ్చరైజర్ మ‌రియు లిప్స్‌కు లిప్‌బామ్ అప్లై చేసుకుని వ‌ర్కౌట్స్ చేస్తే మంచిది.

అలాగే వ‌ర్కౌట్స్ చేసే స‌మ‌యంలో ముఖంపై చెమ‌ట‌లు ప‌డుతూ ఉంటాయి.అయితే చాలా మంది ఆ చెమ‌ట‌ల‌ను ఒంటిపై ఉన్న దుస్తుల‌తో తుడుచుకుంటారు.

ఇలా చేస్తే రాషెస్, దురద‌ వంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయి.కాబ‌ట్టి, ఒక మెత్త‌టి కాట‌న్ టవల్‌తో ముఖం మీద అద్దినట్టు చెమటను తుడుచుకోవాలి.

వ‌ర్కౌట్స్ చేసే స‌మ‌యంలో వాట‌ర్ కూడా ఎక్కువ‌గా తీసుకోవాలి.లేదంటి శ‌రీరంలో డీహైడ్రేట్ అయ్యి.

చ‌ర్మం డ్రైగా మారిపోతుంది.ఇక వ‌ర్కౌట్స్ ఫినిష్ అయిన తరువాత ఖ‌చ్చితంగా ఫేస్ వాష్ చేసుకోవాలి.

ఇలా చేయ‌డం వ‌ల్ల చెమట, మురికి తొలగిపోయి చర్మరంధ్రాలు క్లీన్ అవుతాయి.

వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్గా పాన్ ఇండియా సినిమా హనుమాన్, ఈ ఆదివారం సాయంత్రం 5:30 గంటలకు, మీ జీ తెలుగులో!