కరోనా సమయంలో గర్భిణులు తీసుకోవాల్సిన జాగ్రత్తలివే!

కరోనా సమయంలో గర్భిణులు తీసుకోవాల్సిన జాగ్రత్తలివే!

ప్రపంచ దేశాల్లో శరవేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా మహమ్మారి అన్ని వయస్సుల వారిపై ప్రభావం చూపుతోంది.

కరోనా సమయంలో గర్భిణులు తీసుకోవాల్సిన జాగ్రత్తలివే!

ముఖ్యంగా కరోనా సమయంలో గర్భిణులు వైరస్ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

కరోనా సమయంలో గర్భిణులు తీసుకోవాల్సిన జాగ్రత్తలివే!

వైరస్ బారిన పడితే తల్లితో పాటు బిడ్డకు కూడా ప్రమాదమే.గర్భిణులు కరోనా సమయంలో అత్యవసరమైతే మినహా బయటకు వెళ్లకపోవడమే మంచిది.

గర్భిణులు సాధారణంగా శ్వాస సంబంధిత వ్యాధులకు గురయ్యే అవకాశం ఎక్కువ.అందువల్ల వైరస్ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది.

గర్భిణులు ఉండే గదిలోకి గాలి, వెలుతురు వచ్చేలా జాగ్రత్తలు తీసుకోవాలి.గర్భిణులు ప్రత్యేక టాయిలెట్ ను వినియోగిస్తే మరీ మంచిది.

ఎటువంటి అనారోగ్య సమస్యలు కనిపించినా వెంటనే వైద్యుల సలహాలు, సూచనలు తప్పనిసరిగా తీసుకోవాలి.

ఇంటి పని చేయడం వీలైనంత వరకు తగ్గించుకోవాలి.వైద్యులను తరచూ ప్రత్యక్షంగా సంప్రదించకుండా ఫోన్ లేదా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంప్రదించడం మంచిది.

"""/" / గర్భం, ప్రసవం గురించి మహిళల్లో అనేక సందేహాలు నెలకొని ఉంటాయి.

మహిళలు ప్రసవం తరువాత పిల్లలకు పాలు ఇవ్వడమే మేలు.గర్భిణులు వైద్యులు సూచించే అన్ని జాగ్రత్తలను నిర్లక్ష్యం చేయకుండా పాటించాలి.

డెలివరీ వరకు ఐరన్, కాల్షియం మాత్రలను వాడితే మంచిది.ఆహారంలో కూరగాయలు, ఆకుకూరలు, పెరుగు, పాలు, పప్పు, పండ్లు తీసుకోవాలి.

మానసిక ఒత్తిడి లేకుండా వీలైనంత వరకు ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నం చేస్తే మంచిది.

కరోనా మహమ్మారి అదుపులోకి వచ్చేంత వరకు తల్లి, బిడ్డ తగిన జాగ్రత్తలు తీసుకుంటే వైరస్ బారిన పడకుండా తమను తాము రక్షించుకోవచ్చు.