ద్రాక్షతో ఇలా చేస్తే.. మీ ముఖం తెల్ల‌గా మెరిసిపోవాల్సిందే!

ద్రాక్ష పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.ఎన్నో పోష‌కాలు దాగున్న ద్రాక్ష పండ్ల‌ను చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా అంద‌రూ ఇష్టంగా తింటుంటారు.

ప‌రిమితి మించ‌కుండా ప్ర‌తి రోజు తిన్నా.ద్రాక్ష పండ్ల‌ వ‌ల్ల ఎలాంటి స‌మ‌స్య‌లు ఉండ‌వు.

ఇక ద్రాక్ష పండ్ల‌తో బోలెడ‌న్ని సౌంద‌ర్య ప్ర‌యోజ‌నాలు కూడా ఉన్నాయి.చ‌ర్మాన్ని య‌వ్వ‌నంగా, తెల్ల‌గా మెరిసేలా చేయ‌డంలో ద్రాక్ష పండ్లు గ్రేట్‌గా స‌హాయ‌‌ప‌డ‌తాయి.

మ‌రి ద్రాక్ష పండ్ల‌ను చ‌ర్మానికి ఎలా యూజ్‌ చేయాలి అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.

మొద‌టిది.కొన్ని ద్రాక్ష పండ్ల‌ను తీసుకుని బాగా న‌లిపి ర‌సం తీసుకోవాలి.

ఇప్పుడు ఆ ర‌సంలో కొద్దిగా తేనె వేసి మిక్స్ చేసుకోవాలి.అనంత‌రం ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి అప్లై చేసి.

ఇరవై లేదా ముప్పై నిమిషాల పాటు ఆర‌నివ్వాలి.ఆ త‌ర్వాత చ‌ల్ల‌టి నీటితో ముఖాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.

ఇలా వారానికి మూడు, నాలుగు సార్లు చేయ‌డం వ‌ల్ల ముడ‌త‌లు త‌గ్గి చ‌ర్మం య‌వ్వ‌నంగా మారుతుంది.

మ‌రియు ముఖం మంచి రంగు సంత‌రించుకుంటుంది. """/"/ రెండొవ‌ది.

కొన్ని ద్రాక్ష పండ్ల‌ను తీసుకుని పేస్ట్ చేసుకోవాలి.ఆ పేస్ట్‌లో కొద్దిగా పెరుగు మ‌రియు నిమ్మ‌రసం వేసి క‌లుపుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి అప్లై చేసి.అర‌గంట పావు వ‌దిలేయాలి.

అనంత‌రం గోరు వెచ్చ‌ని నీటితో ముఖాన్ని క్లీన్ చేసుకోవాలి.ఇలా వారినికి రెండు లేదా మూడు సార్లు చేయ‌డం వ‌ల్ల ముఖంపై ఉన్న మొటిమ‌లు, మ‌చ్చ‌లు పోయి.

కాంతివంతంగా మారుతుంది.మూడొవ‌ది.

ద్రాక్ష పండ్ల నుంచి ర‌సం తీసుకోవాలి.ఆ ర‌సంలో కొద్దిగా ఎగ్ వైట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి అప్లై చేసి.ఐదు నిమిషాల పాటు మ‌సాజ్ చేసుకోవాలి.

ఓ పావు గంట త‌ర్వాత గోరు వెచ్చ‌ని నీటితో ముఖాన్ని క్లీన్ చేసుకోవాలి.

ఇలా వారానికి రెండు లేదా మూడు సార్లు చేయ‌డం వ‌ల్ల ముఖం మృదువుగా, ప్ర‌కాశ‌వంతంగా మారుతుంది.

Air Coolers : అమెజాన్ లో ఈ ఎయిర్ కూలర్ లపై ఊహించని భారీ డిస్కౌంట్ ఆఫర్లు..!