పళ్ళు ఆరోగ్యంగా,అందంగా ఉండాలంటే అద్భుతమైన చిట్కాలు

పళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే మన మొత్తం ఆరోగ్యం బాగుటుంది.అలాగే పళ్ళు అందంగా తెల్లగా మెరిసిపోతూ ఉంటే ఆ ఆత్మవిశ్వాసం వేరు.

పళ్ళు తెల్లగా ఉంటే మనం నవ్వినప్పుడు తెల్లని పళ్లవరసతో చూడముచ్చటగా ఉండి ఎదుటివారిని ఆకట్టుకోవచ్చు.ఇప్పుడు పళ్ళు అందంగా,ఆరోగ్యంగా ఉండాలంటే ఈ చిన్న చిన్న చిట్కాలను పాటిస్తే సరిపోతుంది.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px""/" Alt=""<img Style="width: 50%; Display: Inline;" Src="" Alt=""> ప్రతి రోజు రెండు సార్లు తప్పనిసరిగా బ్రష్ చేయాలి.

ముఖ్యంగా పళ్ళు చిగుళ్ళను కలిసే చోట శుభ్రం చేయటం చిగుళ్ల సమస్యలు రాకుండా జాగ్రత్తపడవచ్చు.మెత్తని కుచ్చు ఉన్న బ్రష్ ని ఎంపిక చేసుకోవాలి.

అలాగే బ్రష్ ని మూడు నెలలకు ఒకసారి మార్చుతూ ఉండాలి.!--nextpage టూట్ పేస్ట్ ఎంపిక కూడా చాల ముఖ్యమే.

మీ పళ్లకు సెట్ అయ్యే టూట్ పేస్ట్ ని మాత్రమే వాడాలి.టీవీల్లో,న్యూస్ పేపర్ లో వచ్చే ప్రకటనలను బట్టి టూట్ పేస్ట్ ని ఎంపిక చేసుకోకూడదు.

మీ పంటి తత్వాన్ని బట్టి ఎంపిక చేసుకోవాలి.పళ్ళ మధ్య ఇరుక్కున్న ఆహారపదార్ధాలను తొలగించటానికి పురిపెట్టిన దారంతో పళ్ళ మధ్య శుభ్రపర్చే ఫ్లాసింగ్ విధానాన్ని అవలంబించాలి.

పళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన డైట్ కూడా అవసరమే.చక్కర పదార్ధాలు ఎక్కువగా తీసుకోకూడదు.

చక్కెరలు ఎక్కువగా తీసుకుంటే నోటిలో బ్యాక్టీరియా పెరిగి పంటి మీద ఎనామిల్ పోయే అవకాశాలు ఉన్నాయి.

కాబట్టి ఆరోగ్యకరమైన ఆహారం కూడా ముఖ్యమే.ప్రతి ఆరు నెలలకు ఒకసారి డాక్టర్ దగ్గరకు వెళ్లి చెకప్ చేయించుకోవాలి.

ఇలా చేయించుకోవటం వలన ఏమైనా పంటి సమస్యలు ఉంటే ప్రాధమిక దశలోనే గుర్తించవచ్చు.

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో ఫిర్యాదు చేసిన మాధవీలత.. ఆమెకు న్యాయం జరుగుతుందా?