ఈ చిట్కాలను పాటిస్తే... మానసిక ప్రశాంతత మీ సొంతం!
TeluguStop.com

హిందూ సంప్రదాయాల ప్రకారం వాస్తు శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంది.ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితిపై వాస్తు చాలా ప్రభావం చూపిస్తుందట.


అయితే కుటుంబ సభ్యులంతా హాయిగా, సంతోషంగా ఉండాలంటే ఇంట్లో అన్నీ వాస్తు ప్రకారమే ఉండాలని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.


అయితే ఎటువంటి పరిస్థితులైన ఎవరైనా సరే కొన్ని వాస్తు చిట్కాలను అనుసరించ వచ్చు.
అయితే ఈ చిట్కాలు పాటిస్తే.అనారోగ్యం తొలగి, మానసిక చికాకులను ఎనర్జీని నివారించి మంచి ఆరోగ్యాన్ని, మనశ్శాంతిని పెంపొందిస్తాయట.
అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.ప్రతి రోజూ ఇంట్లో ఈశాన్య దిశలో దీపం వెలిగించాలని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
అలా చేయడం వల్ల మంచి ఆరోగ్యం మన సొంతం అవుతుందట.అలాగే తులసి మొక్కలు ఉన్న ఇంట్లో పరిశుభ్రమైన గాలి వీచి.
పాజిటివ్ ఎనర్జీ వస్తుందట.అలాగే ముళ్ల మొక్కలను.
కాక్టస్ మొక్కలను ఇంట్లో అస్సలే పెంచకూడదట.ఇలా చేస్తే.
కుటుంబ సభ్యులకు అనారోగ్యం, ఒత్తిడి కల్గజేస్తాయి.అంతే కాకుండా పడుకునేటప్పుడు ఎప్పుడూ దక్షిణం వైపునే తల పెట్టుకొని పడుకోవాలంట.
హాయిగా నిద్ర పట్టాలన్నా.ఆరోగ్యంగా జీవించాలన్నా దక్షిణం వైపు తన పెట్టుకునే పడుకోవాలని సూచిస్తున్నారు.
ఉత్తరం వైపు తల పెట్టి పడుకోవడం వల్ల మానసిక ఒత్తిడితో పాటు, శారీరక ఇబ్బందులు కల్గుతాయట.
గర్భం గురించి ప్రయత్నం చేసే వాళ్లు.గర్భిణీలు అస్సలే ఈశాన్య దిశలో పడుకోకూడదంట.
అలా పడుకుంటే గర్భస్రావం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట.అలాగే చదువుతున్నప్పుడు ఉత్తరం లేదా తూర్పు వైపు ముఖం పెడ్తే.
ఇది మంచి జ్ఞాపక శక్తిని పెంపొందిస్తుంది.