ఆకలి మందగించిందా.. ఈ ఎఫెక్టివ్ టిప్స్‌తో చెక్ పెట్టేయండి!

ఆక‌లి మంద‌గించ‌డం.చాలా మందిలో కామ‌న్‌గా క‌నిపించే స‌మ‌స్య ఇది.

చిన్న పిల్ల‌ల్లోనే కాదు.పెద్దల్లో కూడా ఈ స‌మ‌స్య క‌నిపిస్తుంటుంది.

ఈ స‌మ‌స్య‌ను కొంద‌రు ప‌ట్టించుకోరు.అజీర్తి, గ్యాస్‌, పోష‌కాల లోపం, రక్తహీనత ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల ఆక‌లి మంద‌గిస్తుంది.

అయితే ఆక‌లి మంద‌గించ‌డం చిన్న స‌మ‌స్యే అయిన‌ప్ప‌టికీ.నిర్ల‌క్ష్యం చేస్తే మాత్రం ఆరోగ్యంపై తీవ్ర ప్ర‌భావం ప‌డుతుంది.

అందువ‌ల్ల‌, ఆక‌లి మంద‌గించ‌డాన్ని ఏ మాత్రం నిర్ల‌క్ష్యం చేయ‌కుండా.ముందు నుంచే త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి.

"""/" / అయితే ఇప్పుడు చెప్పుకోబోయే ఎఫెక్టివ్ టిప్స్ ఫాలో అయితే.సులువుగా ఈ స‌మ‌స్య‌ను దూరం చేసుకోవ‌చ్చు.

మ‌రి ఆ టిప్స్ ఏంటీ అన్న‌ది లేట్ చేయ‌కుండా ఓ లుక్కేసేయండి.ఖర్జూరాలు ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు.

ఎన్నో పోష‌కాలు నిండి ఉండే ఖ‌ర్జూరాల‌కు ఆక‌లి పెంచే గుణం ఉంది.అందువ‌ల్ల‌, ఖ‌ర్జూరాల‌ను ప్ర‌తి రోజు నాలుగు చొప్పున తీసుకుంటే మంచి ఫ‌లితం ఉంటుంది.

అలాగే అజీర్తి, గ్యాస్ స‌మ‌స్య‌ల వ‌ల్ల కూడా ఆక‌లి మంద‌గిస్తుంది.అందువ‌ల్ల‌, ఒక గ్లాస్ నీటిలో వాము వేసి బాగా మ‌రిగించాలి.

అనంత‌రం ఆ నీటిని గోరు వెచ్చ‌గా అయిన త‌ర్వాత సేవించాలి.ఇలా త‌ర‌చూ చేయ‌డం వ‌ల్ల కూడా ఆకలి బాగా వేస్తుంది.

లేదా అల్లం న్ని శుభ్రంగా తొక్క తీసి వాట‌ర్‌తో క్లీన్ చేసుకోవాలి.ఆ త‌ర్వాత ఆ అల్లం ముక్కను దవడన పెట్టుకుని నమిలి, ఆ రసాన్ని మింగుతూ ఉండాలి.

ఇలా చేసినా.జీర్ణ స‌మ‌స్య‌లు దూర‌మై ఆక‌లి వేసేలా చేస్తుంది.

"""/" / అలాగే నిమ్మ ర‌సానికి జీర్ణక్రియను వేగవంతం చేయ‌డంలోనూ, ఆక‌లి వేసేలా చేయ‌డంలోనూ అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.

కాబ‌ట్టి, గోరు వెచ్చ‌ని నీటిలో కొద్దిగా నిమ్మ ర‌సం తీసుకుంటే మంచి ఫ‌లితం ఉంటుంది.

ఇక చిరుతిళ్ళు ఎక్కువగా తినటం వల్ల ఆక‌లి చ‌చ్చిపోతుంది.అందువ‌ల్ల‌, భోజ‌నానికి ముందు చిరుతిళ్ల‌కు దూరంగా ఉండండి.

Siddharth, Aditi Rao Hydari : సిద్దార్థ్, అదితి సంపాదన ఆస్తులు ఎంతో తెలిస్తే మాత్రం షాకవ్వాల్సిందే.. ఆ రేంజ్ లో సంపాదన ఉందా?