కంటి చూపు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ నియమాలు పాటించాల్సిందే..

చాలామంది ఈ అధునిక కాలంలో కంటి చూపు తగ్గి ఎన్నో అవస్థలు పడుతున్నారు.

అయితే అతి చిన్న వయసులో కూడా కంటిచూపు సమస్యలతో బాధపడుతున్నారు.ఆఖరికి చిన్న పిల్లలు కూడా ఈ మధ్య కళ్ళజోడుతో కనిపిస్తున్నారు.

దీనికి కారణం పోషకాహార లోపం, టీవీ, మొబైల్ ఎక్కువ చూడటం, అలాగే వంశపార్యంపర్యం లాంటివి అని చెప్పవచ్చు.

అయితే మన జీవన విధానంలో కొన్ని మార్పుల ద్వారా మన కంటి చూపును మెరుగుపరుచుకోవచ్చు.

"""/"/ అంతేకాకుండా నిరంతరం ఆరోగ్యంగా కూడా ఉండొచ్చు.అయితే అతి ముఖ్యంగా బీడీ, సిగరెట్లకు దూరంగా ఉండాలి.

బీడీ, సిగరెట్ లు కాల్చడం ద్వారా శరీరంలోని అవయవాలు తీవ్ర ఆరోగ్యానికి గురవుతాయి.

దీంతో రోగనిరోధక వ్యవస్థ తీవ్రంగా అనారోగ్యానికి పాలవుతుంది.అయితే సిగరెట్ పొగలోని యాక్సిడెంట్ల వల్ల ఏఎండి సమస్య వస్తుంది.

దీంతో కంటి నుంచి నీరు కారడం, కళ్ళు ఎరుపెక్కి పోవడం లాంటి కంటి వ్యాధులు వస్తాయి.

కాబట్టి దీనికి దూరంగా ఉండటం మంచిది.అంటే అనవసర సమయాల్లో స్క్రీన్ వైపు చూడడం తగ్గించాలి.

ఫోన్ లు అలాగే కంప్యూటర్లను ఎక్కువగా వాడడం మంచిది కాదు.ఎందుకంటే స్క్రీన్ లోని నీలిరంగు కాంతి కంటి చూపును తీవ్రంగా దెబ్బతిస్తుంది.

దీంతో అలసట, పొడి కళ్ళు, మయోపియా అలాగే ఏఏండీ లాంటి అనేక వ్యాధులు ఎదురవుతాయి.

అందుకే కళ్ళను పొడిబారకుండా చూసుకోవాలి. """/"/ అంతేకాకుండా పోషకాహారం కూడా తినాలి.

కళ్ళు సురక్షితంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారం చాలా అవసరం.బయట దొరికే జంక్ ఫుడ్ తినకుండా కూరగాయలు, పండ్లు తినాలి.

అలాగే విటమిన్ ఏ ఉండే చేపలు, గుడ్లు, పాల ఉత్పత్తులు, నారింజ, క్యారెట్లు లాంటి ఆహార పదార్థాలు తింటే కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి.

ఇక తరచూ కంటి పరీక్షలు కూడా క్రమం తప్పకుండా చేయించుకుంటూ ఉండాలి.ఇక వైద్యులు చెప్పిన సూచనలు పాటిస్తూ ఉండాలి.