నోటి దుర్వాస‌న‌ను ఈజీగా పోగొట్టే ఎఫెక్టివ్ టిప్స్‌!!

నోటి దుర్వాసన.ఈ స‌మ‌స్య‌తో చాలా మంది ఇబ్బంది ప‌డుతూ.

ఎదుట‌వారిని ఇబ్బంది పెడుతుంటారు.ఈ స‌మ‌స్య నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా.

ఫ‌లితం లేక బాధ‌ప‌డుతుంటారు.నోటి దుర్వాస‌నతో బాధ‌ప‌డేవారు ఇత‌రుల‌తో మాట్లాడేందుకు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు.

అయితే ఇప్పుడు చెప్ప‌బోయే ఎఫెక్టివ్ టిప్స్ పాటిస్తే.సులువుగా ఈ స‌మ‌స్య‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు.

అందులో ముందుగా లవంగం.ఇందులో ఉండే యాంటీ బాక్టీరియల్ లక్షణాలు నోటి వాసనలను తగ్గించడానికి ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తుంది.

అందుకే రోజుకో క‌ప్పు ల‌వంగం టీ తాగినా లేదా ల‌వంగంను నోట్లో వేసుకుని న‌మిలినా.

నోటి దుర్వాస‌న నివారించ‌వ‌చ్చు.అలాగే ఆహారం తీసుకున్న త‌ర్వాత ఖ‌చ్చితంగా నీటితో నోరు పుక్కిలించి ఊసేయాలి.

నోటిలో ఆహారం ఎక్కువ‌సేపు ఉన్న‌ట్ల‌యితే బ్యాక్టీరియా ఏర్ప‌డి.దుర్వాస‌న‌కు దారితీస్తుంది.

"""/" / పెరుగు కూడా నోటి దుర్వాసనను తగ్గిస్తుంద‌ట‌.ఆరువారాల పాటు క్రమం తప్పకుండా పెరుగు తినడం ద్వారా నోటి దుర్వాసన తగ్గుముఖం ప‌డుతుంద‌ని ఓ అధ్య‌య‌నంలో తేలింది.

అలాగే ప్ర‌తిరోజు నిమ్మ‌ర‌సం క‌లిపి నీటితో నోరు పుక్కిలించి ఊసేయాలి.ఎందుకంటే.

నిమ్మరసంలోని ఆమ్ల గుణాలు నోట్లో బ్యాక్టీరియాను నాశ‌నం చేస్తుంది.త‌ద్వారా నోటి దుర్వాస‌న త‌గ్గుముఖం ప‌డుతుంది.

దాల్చినచెక్క కూడా నోటి దుర్వాస‌న పోగొట్ట‌డంలో స‌హాయ‌ప‌డుతుంది.అందుకే ప్ర‌తి రోజు దాల్చినచెక్క టీ తాగినా లేదా దాల్చినచెక్క ‌ను నోట్లో వేసుకుని న‌మిలినా.

నోటి దుర్వాస‌నకు చెక్ పెట్ట‌వ‌చ్చు.అలాగే బేకింగ్ సోడాను నీటిలో క‌లిపి.

ఆ నీటితో నోరు పుక్కిలించి ఊసేయాలి.ఇలా చేయ‌డం వ‌ల్ల కూడా స‌మ‌స్య నుంచి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు.

వారానికి 2 సార్లు ఈ ఆయిల్ ను వాడితే మీ హెయిర్ సూపర్ లాంగ్ గా మారడం గ్యారంటీ!