Cotton Farming : పత్తి పంటను తామర పురుగుల బెడద నుండి సంరక్షించుకునే పద్ధతులు..!
TeluguStop.com
భారతదేశంలో వరి తరువాత అత్యధిక విస్తీర్ణంలో సాగు అవుతున్న పంటగా పత్తి పంట( Cotton Farming )ను చెప్పవచ్చు.
రైతులు పత్తి పంటను తెల్ల బంగారం గా పిలుచుకుంటారు.అంటే పత్తి పంట సాగు విధానంపై అవగాహన ఉంటే ఆశించిన స్థాయిలో దిగుబడులు పొంది మంచి ఆదాయం అర్జించవచ్చు.
ఇతర పంటలతో పోలిస్తే పత్తి పంటకు పెట్టుబడి వ్యయం కాస్త ఎక్కువ.కాబట్టి ముందు సాగు విధానంపై అవగాహన కల్పించుకొని ఆ తర్వాత సాగు చేపట్టాలి.
ఇక చీడపీడల, తెగుళ్ల బెడద( Pests ) కూడా కాస్త ఎక్కువే.సకాలంలో వీటిని గుర్తించి తొలిదశలోనే అరికట్టే ప్రయత్నాలు చేయాలి.
పత్తి పంటను వర్షాధార పంటగా కూడా పండించవచ్చు.కాకపోతే నీటి వనరులు ఉంటే మంచి నాణ్యమైన అధిక దిగుబడి పొందవచ్చు.
జూన్ రెండవ వారం లోపు పత్తి విత్తనం( Cotton Seeds ) విత్తుకునేలా నేలను తయారు చేయాలి.
"""/"/ నేలను వేసవికాలంలో లోతు దుక్కులు దున్నుకుంటే, కలుపు మొక్కల విత్తనాలు( Weeds ) నాశనం అయ్యి కలుపు సమస్య చాలా వరకు తక్కువగా ఉంటుంది.
మార్కెట్లో నకిలీ పత్తి విత్తనాల దందా( Fake Cotton Seeds ) నడుస్తోంది కాబట్టి తెగులు నిరోధక కంపెనీ సర్టిఫైడ్ విత్తనాలను మాత్రమే ఎంపిక చేసుకుని సాగు చేపట్టాలి.
మొక్కల మధ్య 35 సెంటీమీటర్ల దూరం, మొక్కల వరుసల మధ్య 60 సెంటీమీటర్ల దూరం ఉండేటట్లు నాటుకుంటే పొలంలో అంతర కృషి చేయడానికి అనువుగా ఉంటుంది.
మొక్కల మధ్య దూరం ఉంటే మొక్కలు ఆరోగ్యకరంగా పెరుగుతాయి.పత్తి పంటకు తామర పురుగుల బెడద కాస్త ఎక్కువ.
ఈ తామర పురుగులు పత్తి మొక్క లేత ఆకులను ఆహారంగా తీసుకోవడం వల్ల ఊహించని నష్టం ఎదుర్కోవాల్సిందే.
"""/"/
కాబట్టి తామర పురుగులను( Thrips ) పొలంలో గుర్తించిన వెంటనే ఒక ఎకరం పొలానికి 500 మిల్లీలీటర్ల ఎండో సల్ఫాన్ ను ఒక లీటరు నీటిలో కలిపి మొక్కల ఆకులు పూర్తిగా తడిచేటట్లు పిచికారి చేయాలి.
పత్తి పంటకు నీటి అవసరం కాస్త ఎక్కువే.వర్షాధార పంటగా సాగు చేస్తే మొదట్లో నీటి తడుల అవసరం పెద్దగా ఉండదు.
పంట ఎదిగిన తర్వాత పూత దశలో ఉన్నప్పుడు నీటిని అందిస్తే మంచి దిగుబడి పొందవచ్చు.
ఆ సినిమాను వదిలేసినందుకు ప్రభాస్ ఇప్పటికి బాధపడుతూ ఉంటాడా..?