అల్లూరి జిల్లా ఏవోబీలో టిప్పర్ బోల్తా.. ఐదుగురు మృతి

అల్లూరి జిల్లా ఏవోబీలో టిప్పర్ బోల్తా పడింది.ఈ ప్రమాదంలో ఐదుగురు మృత్యువాత పడ్డారు.

మరో పదకొండు మందికి తీవ్రగాయాలు అయ్యాయి.ఏవోబీ కటాఫ్ ఏరియాలోని హంతల్ గూడా ఘాట్ రోడ్డులో ప్రమాదం చోటు చేసుకుంది.

వెంటనే గమనించిన స్థానికులు బాధిత వ్యక్తులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.చిత్రకొండ నుంచి సిమెంట్ లోడ్ తో వస్తుండగా ప్రమాదం జరిగిందని సమాచారం.

ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

కల్కి పార్ట్ 2 పై కీలక అప్డేట్ ఇచ్చిన నిర్మాత…అప్పుడే షూటింగ్ పూర్తి అంటూ?