క్యాన్సర్‌ చికిత్సలో సహకరించడానికి సరికొత్త రోబో తయారు చేసిన సైంటిస్టులు!

క్యాన్సర్‌ మహమ్మారి( Cancer ) నేడు పల్లెలు, పట్టణాలు అని చూడడంలేదు.ఎవరి పడితే వారిని బాధిస్తోంది.

నేటి దైనందిత జీవన విధానంలోని మార్పులే దానికి కారణం అని వేరే చెప్పాల్సిన పనిలేదు.

అప్పటి వరకు ఆరోగ్యవంతులుగా సమాజంలో కనబడేవారు హఠాత్తుగా క్యాన్సర్‌ బారిన పడి నెలల వ్యవధిలో మరణించడం మనం చూస్తూ వున్నాం.

అక్కడ, ఇక్కడా అని కాదు.ప్రపంచ వ్యాప్తంగా ఈ సమస్య వుంది.

ఈ నేపథ్యంలోనే యూనివర్సిటీ ఆఫ్ లీడ్స్( University Of Leeds ) సైంటిస్టులు ఓ అద్భుతం చేసారు.

ఊపిరితిత్తుల క్యాన్సర్‌ బాధితులకు మెరుగైన పద్ధతిలో ట్రీట్మెంట్ అందించడంలో సహాయపడే కొత్త రోబోట్‌ను తయారు చేశారు.

"""/" / ఒక చిన్న పురుగు ఆకారంలో కనిపించే ఈ అధునాతన టెక్నాలజీని క్యాన్సర్ రోగుల్లో ప్రారంభ సంకేతాలను గుర్తించి లంగ్స్( Lungs ) లోపలికి పంపించడం ద్వారా మెరుగైన ట్రీట్‌మెంట్ అందించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.

ఇది లోపలి భాగంలోని క్యాన్సర్ కణాలను గుర్తిస్తుందని, కేవలం 0.08 అంగుళాల వ్యాసాన్ని కొలువడంతోపాటు, అయస్కాంతాల ద్వారా కంట్రోల్ చేయబడుతుందని కూడా వారు చెబుతున్నారు.

అల్ట్రా-సాఫ్ట్ డివైస్ (రోబోట్)( Ultra Soft Device ) శరీరంలోని కొన్ని చిన్న శ్వాసనాళాలను కూడా యాక్సెస్ చేస్తుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.

అయితే తమ కొత్త ఆవిష్కరణ మరింత ఖచ్చితమైన క్యాన్సర్ చికిత్సను అందించడంలో దోహదపడుతుందని చెప్పడం ఇక్కడా మెచ్చుకోదగ్గ విషయం.

"""/" / కాగా దీని పనితీరును నిర్ధారించేందుకు పలువురు ల్యాబ్‌లో ఇంజనీర్లు, సైంటిస్టులు, డాక్టర్ల బృందం ఒక శవంలోని ఊపిరితిత్తులపై ప్రయోగాన్ని తాజాగా అక్కడి లేబ్ లో నిర్వహించింది.

ఈ సందర్భంగా సైంటిస్టులు సాంప్రదాయ పరికరాల కంటే, ఈ అధునాతన రోబోట్( Robot ) పరికరం 37 శాతం లోతుగా ప్రయాణించగలదని చెబుతున్నారు.

అంతేకాకుండా తక్కువ కణజాల నష్టాన్ని కలిగిస్తుందని వారు ఈ క్రమంలో కనుగొన్నారు.ఆధునిక వైద్య చరిత్రలో ఇది మరొక మైలు రాయిగా ప్రధాన పరిశోధకుడు ప్రొఫెసర్ పియట్రో వల్దాస్త్రి పేర్కొన్నాడు.

ఇక నుండి ప్రతీ ఆదివారం పెట్రోల్ బంకులు బంద్…!?