న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో ‘‘ఇంటర్నేషనల్ యోగా డే’’ సెలబ్రేషన్స్.. 3 వేల మంది యోగాసనాలు

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని భారత్‌తో పాటు ప్రపంచంలోని పలు దేశాలు ఘనంగా జరుపుకొంటోన్నాయి.

అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ వంటి పలు దేశాలు యోగా దినోత్సవాన్ని పాటిస్తోన్నాయి.బహిరంగ ప్రదేశాలు, పార్కుల్లో యోగాసనాలను వేస్తోన్నారు అక్కడి ప్రజలు.

కరోనా నేపథ్యంలో యోగాకు ప్రాధాన్యత మరింత పెరిగింది.ముఖ్యంగా సెకండ్ వేవ్‌లో ఆక్సిజన్ లెవల్స్‌ను పెంచుకునేందుకు పలు రకాల యోగాసనాలను సూచించారు వైద్య నిపుణులు.

ప్రాణాయామం ఎంతోమంది ప్రాణాలు నిలబెట్టిందని చెప్పుకోవచ్చు.భారతీయులు అత్యధిక సంఖ్యలో స్థిరపడిన అమెరికాలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఉత్సాహంగా జరుపుకొంటోన్నారు.

భారతీయులతో పాటు స్థానిక అమెరికన్లు కలిసి న్యూయార్క్‌లోని ప్రతిష్ఠాత్మక టైమ్స్ స్క్వేర్ వద్ద యోగా డే సెలబ్రేషన్స్‌ను ఏర్పాటు చేశారు.

దీనిలో భాగంగా రోజంతా ఈ కార్యక్రమం కొనసాగుతోంది.సోల్స్‌టైస్ థీమ్ (Solstice Theme Yoga)తో ఈ కార్యక్రమాన్ని జరుపుకొంటోన్నారు.

ఏడాదిలో సుదీర్ఘమైన రోజు కూడా కలిసి రావడంతో దీనికి సోల్స్‌టైస్ థీమ్‌గా పేరు పెట్టారు.

అమెరికాలోని భారత కాన్సులేట్ జనరల్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.దాదాపు మూడువేల మందికి ఇందులో పాల్గొని యోగాసనాలు వేశారు.

"""/"/ గడిచిన ఏడు సంవత్సరాలుగా అమెరికాలో అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తోన్నట్లు భారత కాన్సులేట్ అధికారులు పేర్కొన్నారు.

ప్రతి ఏడాది ఈ కార్యక్రమంలో పాల్గొనే వారి సంఖ్య రెట్టింపు అవుతోందని వారు తెలిపారు.

ఇది ఆహ్వానించదగ్గ పరిణామమని వారు అన్నారు.న్యూయార్క్‌లోని ఒక్క టైమ్స్ స్క్వేర్ వద్ద నిర్వహిస్తోన్న కార్యక్రమానికే మూడు వేల మందికి పైగా హాజరయ్యారని, దీన్ని బట్టి చూస్తే అమెరికాలో యోగాకి ఉన్న ప్రాధాన్యత అర్థం చేసుకోవచ్చని అధికారులు అన్నారు.

అమెరికాలోని ప్రధాన నగరాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా భారీ ఏర్పాట్లు చేసినట్లు ఇండియన్ కాన్సులేట్ అధికారులు పేర్కొన్నారు.

ఇవాళ వైసీపీ మ్యానిఫెస్టో విడుదల..!