బ్రిటిష్ వారి సిద్ధాంతం ఫాలో అవుతున్న మోడీ! టైమ్స్ కథనంలో వాస్తవం ఎంత

ప్రఖ్యాత టైమ్స్ మ్యాగజైన్ లో ఓ వ్యక్తి గురించి కవర్ స్టొరీ వచ్చింది అంటే దానికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

అయితే అలాంటి టైమ్స్ మ్యాగజైన్ లో కూడా అప్పుడప్పుడు కొంత మందిని టార్గెట్ చేసే విధంగా కథనాలు వస్తూ ఉంటాయి.

ఇండియా ఆర్ధికాభివృద్ధిని సహించలేని అమెరికా గుత్తాదిపత్యం భారత్ ని టార్గెట్ చేస్తూ కొన్ని విమర్శనాత్మక కథనాలు అప్పుడప్పుడు ప్రచురించిన సందర్భాలు ఉన్నాయి.

తాజాగా ప్రధాని మోడీపై రెండో సారి టైమ్స్ మ్యాగజైన్ లో ఓ వివాదాస్పద కథన వచ్చింది.

మోడీ ఒక విభజన వాది.ఇండియాస్ డివైడెడ్ రూల్స్ తో అతని పరిపాలన సాగిస్తున్నాడు అంటూ అతీస్ తసీర్ అనే జర్నలిస్ట్ కథన రాసారు.

బ్రిటిష్ వారు ఇండియాపై ప్రయోగించిన విభజించు, పాలించు అనే సిద్ధాంతాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఫాలో అవుతూ దేశ రాజకీయాలు చేస్తున్నారని ఆ కథనం అర్ధం.

మరో సారి మోడీ అధికారంలోకి వస్తాడని దేశ వ్యాప్తంగా పలు సర్వేలు చెబుతున్న టైంలో ఊహించని విధంగా టైమ్స్ మ్యాగజైన్ లో ప్రచురించిన ఈ కథనం ఓ విధంగా కాంగ్రెస్ పార్టీకి అస్త్రంగా మారింది అని చెప్పాలి.

ఇక టైమ్స్ కథనాన్ని ప్రాంతీయ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ కూడా సమర్ధిస్తూ మోడీ నిజంగా విభజనవాది, అతను దేశాన్ని విచ్చిన్నం చేసే ప్రయత్నం చేస్తున్నారు అంటూ విమర్శలు అందుకున్నారు.

మరి దీనిపై బీజేపీ పార్టీ ఎలాంటి కౌంటర్ ఇస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

షారుఖ్ ఖాన్ పాదాలను తాకిన రానా దగ్గుబాటి.. రానా రెస్పెక్ట్ కు ఫిదా అవ్వాల్సిందే!