అవినీతి సీఎం ను దించాల్సిన సమయం వచ్చింది: అమిత్ షా

గత తొమ్మిదిన్నర సంవత్సరాలలో కెసిఆర్ ప్రభుత్వం( KCR ) అవినీతికి అవకాశమున్న ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోలేదని, బారాస ప్రభుత్వం( BRS ) చేసపట్టిన ప్రతీ ప్రాజెక్టులోనూ అవినీతి వెలుగు చూసిందన్నారు .

22,000 కోట్లు ఖర్చుపెట్టినా ఇంకా కాకతీయ మిషన్ పనులు పూర్తి కాలేదని, మియాపూర్ భూముల కుంభకోణం లో 4 వేల కోట్ల అవినీతి జరిగిందని, ఓఆర్ఆర్, కాలేశ్వరం ఇలా ప్రతి పథకంలోనూ బారాస భారీగా డబ్బులు దోచుకుందన్నారు .

కేసీఆర్ కుమార్తె కవిత పాత్ర మద్యం కుంభకోణం, గ్రానైట్ కుంభకోణాల్లో ఉందని ,తన కొడుకు అభివృద్ధి కోసం అవినీతి చేయడం తప్ప కేసీఆర్ తెలంగాణ ప్రజలకు చేసింది ఏమీ లేదన్నారు అమిత్ షా.

( Amit Shah ) నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో జరిగిన భాజపా సకల జనుల విజయ సంకల్ప సభలో మాట్లాడిన ఆయన బజాపా అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం చేశారు.

"""/" / కారు స్టీరింగ్ ఓవైసీ చేతిలో ఉండటం వల్లే తెలంగాణ విమోచన దినోత్సవం కూడా జరుపుకోవడానికి కేసీఆర్ భయపడుతున్నారని, తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అధికారికంగా వేడుకలు నిర్వహిస్తామని చెప్పుకొచ్చారు .

గత ఏడు సంవత్సరాల లో ఆరు కేటగిరీల్లో టీపీఎస్ఎస్సి పేపర్లు లీకేజీ అయ్యాయని దీనికి బాధ్యులైన వారందరినీ జైలుకు పంపిస్తామని అమిత్ షా హెచ్చరించారు.

ప్రధాని మోదీ నిర్ణయం మేరకు నిజామాబాద్ లో పసుపు బోర్డు( Turmeric Board ) ఏర్పాటు అయిందని ,నిజామాబాద్ జిల్లాలో బీడీ కార్మికుల కోసం 500 పడకల ఆసుపత్రి నిర్మిస్తామని.

"""/" / ఉత్తర తెలంగాణలో ఇతర దేశాలకు విపరీతమైన వలసలు వెళ్తున్నారని వారికోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

దళితుడిని సీఎం చేస్తానని కేసీఆర్ మాట త ప్పారని తాము మాత్రం కచ్చితంగా వెనుకబడిన తరగతులకు చెందిన వ్యక్తినే ముఖ్యమంత్రి చేస్తామని నొక్కి వక్కాణించారు.

బారాస కాంగ్రెస్లలో మంత్రి పదవులు ప్రజా మద్దత్తు ఉంటే రావని టేబుల్ పై టెండర్ లని తీసి ఎవరు ఎక్కువకు కోట్ చేశారు లేదా ఎవరు ఎక్కువ డబ్బులు ఇచ్చారు అన్న దాన్ని బట్టి మంత్రి పదవులు దక్కుతాయని ఈ స్థాయి అవినీతి చేసిన ముఖ్యమంత్రిని దించాల్సిన సమయం ఆసన్నమైంది అని తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు .

యూపీఐ యాప్‌ల ద్వారా పొరపాటున డబ్బు వేరొకరికి పంపారా? ఇలా చేస్తే డబ్బు తిరిగి పొందవచ్చు!