అమెరికా ఎన్నికల ప్రచారంలో కొత్త పద్దతులు హల్చల్ చేస్తున్న యోగా

అమెరికాలో ఎన్నికల హడావిడి జోరుగా సాగుతోంది.అధ్యక్ష పీఠం కోసం పోటీ పడే అభ్యర్ధులు వింత వింతగా ఎన్నికల ప్రచారం చేస్తూ ప్రజల దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

ముఖ్యంగా డెమొక్రటిక్ పార్టీ తరుపు నుంచీ ఏకంగా 24 మంది బరిలో నిలువగా ఎవరికి వారు ప్రజల మనస్సుని చొరగోనే ప్రయత్నం చేస్తున్నారు.

ఇక రిపబ్లికన్ పార్టీ నుంచీ ట్రంప్ మళ్ళీ బరిలో దిగిన విషయం విధితమే.

ఇదిలాఉంటే డెమోక్రటిక్ పార్టీ తరుపునుంచీ అధ్యక్ష పదవి అభ్యర్ధిత్వం కోరుతున్న టిమ్ రియాన్ తన ఎన్నికల నిధుల కోసం సరికొత్త ప్రచారానికి తెరతీశారు.

ఎన్నికల నిధులు సమకూర్చుకునేందుకు అమెరికాలో ముందస్తు ఆరోగ్య పరిరక్షణ విధానానికి ప్రజా మద్దతుని కూడగట్టుకునేందుకు యోగాని ఆయుధంగా వాడుకుంటున్నారు.

యోగా ఎన్నికల ప్రచారంలోకి ఎలా వాడుతున్నారనే కదా సందేహం ఎలా అంటే """/"/ యోగా శిక్షణ శిబిరం ఏర్పాటు చేసిన రియాన్ తనతో పాటు యోగా శిక్షణ కార్యక్రమంలో పాల్గొని తనతో యోగా చేసేందుకు ఒక్కొక్కరుగా మూడు డాలర్లు విరాళంగా ఇవ్వాల్సిందిగా ఆయన కోరారు.

ఈ క్రమంలో వచ్చిన విరాళాలలోంచి కొంతమందిని డ్రా ద్వారా ఎంపిక చేసిన వారిని న్యూయార్క్ ట్రిప్ కి పంపుతామని ఓ ప్రకటన విడుదల చేశారు.

దాంతో యోగా శిక్షణ శిబిరానికి ప్రజలు భారీగా చేరుకుంటున్నారు.

జక్కన్న రాసి ఇచ్చిన లెటర్ ను ఫ్రేమ్ కట్టించిన డైరెక్టర్.. ఆ లేఖలో ఏముందంటే?