రిలీజ్ డేట్ మార్చుకున్న ‘టిల్లు స్క్వేర్’.. కొత్త డేట్ ఎప్పుడంటే?
TeluguStop.com
గత ఏడాదిలో మన టాలీవుడ్ ( Tollywood )బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అయిన సినిమాల్లో ''డీజే టిల్లు'' ( DJ Tillu )కూడా ఉంది.
ఈ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది.
యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ ( Siddhu Jonnalagadda ) హీరోగా నేహా శెట్టి హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం డీజే టిల్లు.
ఈ సినిమా ఎలాంటి సంచనాలు క్రియేట్ చేసిందో అందరికి తెలుసు.ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టరనే చెప్పాలి.
డైరెక్టర్ విమల్ కృష్ణ( Director Vimal Krishna ) ఈ సూపర్ హిట్ సినిమాను తెరకెక్కించారు.
ఈ సినిమా బాగా అలరించడంతో దీనికి సీక్వెల్ ను తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమా రిలీజ్ అయినప్పుడే సీక్వెల్ అనౌన్స్ చేయగా ఈ ఏడాది ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళింది.
అయితే ఈసారి ఈ సినిమాను మల్లిక్ రామ్ డైరెక్ట్ చేస్తుండగా ఈ సినిమాకు 'టిల్లు సీక్వెల్' ( Tillu Sequel )అనే టైటిల్ ను అనౌన్స్ చేసారు.
"""/" /
ఈ సినిమాలో సిద్ధూ జొన్నలగడ్డ కు జోడీగా అనుపమ పరమేశ్వరన్( Anupama Parameswaran ) ను ఎంపిక చేసారు.
ఈ జోడీ ఎలా ఉంటుందో చూడాలని ఆడియెన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
మరి తాజాగా ఈ సినిమా రిలీజ్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది.
ఈ సినిమాను ముందుగా సెప్టెంబర్ 15న రిలీజ్ చేయాలని మేకర్స్ అనుకున్నారు. """/" /
కానీ ఇప్పుడు ఈ డిసిషన్ ను మార్చుకున్నారని సెప్టెంబర్ 15న రిలీజ్ చేయకుండా మరో కొత్త డేట్ ను పరిశీలిస్తున్నట్టు టాక్.
మరి ఈ సినిమాను అక్టోబర్ లో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట.ఎందుకంటే సెప్టెంబర్ లో భారీ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.
దీంతో ఈ పోటీలో రిలీజ్ చేయడం కంటే ఆ తర్వాత రిలీజ్ మంచిది అని మేకర్స్ భావిస్తున్నారట.
చూడాలి మరి అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో.
మద్యం అలవాటు పోవాలా.. అయితే కరక్కాయను ఇలా తీసుకోండి!