Tillu Square : టిల్లు స్క్వేర్ మూవీ ప్లస్, మైనస్ పాయింట్లు ఇవే.. సిద్ధు జొన్నలగడ్డ బాక్సాఫీస్ ను షేక్ చేస్తాడా?

సిద్ధు జొన్నలగడ్డ( Siddu Jonnalagadda ), అనుపమ జంటగా నటించిన టిల్లు స్క్వేర్ మూవీ ఈరోజే థియేటర్లలో విడుదలైంది.

డీజే టిల్లు సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన ఈ సినిమా ఆ మ్యాజిక్ ను రిపీట్ చేసిందా అనే ప్రశ్నకు రిపీట్ చేసిందనే సమాధానం వినిపిస్తోంది.

చిన్న సినిమాల్లో పెద్ద హిట్ గా టిల్లు స్క్వేర్ నిలిచే ఛాన్స్ అయితే ఉంది.

అటు సిద్ధు జొన్నలగడ్డ ఇటు అనుపమ( Anupama Parameswaran ) తమ యాక్టింగ్ స్కిల్స్ తో అదరగొట్టేశారనే చెప్పాలి.

కామెడీ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు మాత్రం ఈ సినిమా ఎంతగానో నచ్చే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

టిల్లు స్క్వేర్ సినిమా( Tillu Square )కు స్టోరీ, స్క్రీన్ ప్లే సిద్ధు జొన్నలగడ్డ అందించగా ఆ విషయంలో సిద్ధుకు మంచి మార్కులు పడ్డాయి.

సితార బ్యానర్ కు ఈ సినిమాతో మరో సక్సెస్ ఖాతాలో చేరినట్టేనని చెప్పవచ్చు.

2 గంటల నిడివి మాత్రమే ఉండటం ఈ సినిమాకు మరింత ప్లస్ అవుతుంది.

"""/"/ ప్రస్తుతం థియేటర్లలో రన్ అవుతున్న చిన్న సినిమాలు కలెక్షన్ల పరంగా అదరగొట్టడంలో ఫెయిల్ అవుతున్న నేపథ్యంలో టిల్లు స్క్వేర్ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని భారీ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తుందేమో చూడాల్సి ఉంది.

తాజాగా విడుదలైన రిలీజ్ ట్రైలర్ ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది.రిలీజ్ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.

"""/"/ కథ, కథనం, సిద్ధు జొన్నలగడ్డ కామెడీ టైమింగ్( Comedy ), అనుపమ గ్లామర్, సాంగ్స్ ఈ సినిమాకు హైలెట్ గా నిలవగా అక్కడక్కడా బోరింగ్ గా సాగే సన్నివేశాలు ఈ సినిమాకు మైనస్ అయ్యాయని చెప్పవచ్చు.

డీజే టిల్లు సినిమా నచ్చిన ప్రేక్షకులకు టిల్లు స్క్వేర్ నచ్చుతుందని చెప్పడంలో సందేహం అవసరం లేదని తెలుస్తోంది.

సిద్ధు కెరీర్ లోనే ఈ సినిమాకు హైయెస్ట్ బిజినెస్ జరగగా కలెక్షన్లు( Tillu Square Collections ) ఏ రేంజ్ లో ఉంటాయో చూడాల్సి ఉంది.

పీరియడ్స్ అన్నా పట్టించుకోరు.. హీరోయిన్ నిత్యామీనన్ షాకింగ్ కామెంట్స్ వైరల్!