బ్యాన్ తొలగించాలని కోర్టు మెట్లు ఎక్కనున్న టిక్ టాక్

చైనాతో బోర్డర్ టెన్షన్స్ కారణంగా భారతదేశం చైనా ఆర్థిక మూలాలకు చెక్ పెట్టేందుకు చైనా కు సంబంధించిన యాప్స్ ను బ్యాన్ చేసింది.

అందులో అత్యంత ప్రజాదారణ పొందిన టిక్ టాక్ కూడా ఉంది.భారత్ తీసుకున్న సంచలన నిర్ణయాన్ని అమెరికా కూడా తమ దేశంలో అమలుచేసింది.

ఇప్పటికే భారత్ బ్యాన్ తో దాదాపు సగం పైన ఆదాయం కోల్పోయిన టిక్ టాక్.

అమెరికన్ ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని అక్కడి కోర్టులలో ఛాలెంజ్ చేయడానికి సిద్ధమవుతున్నట్టు సమాచారం.

అమెరికా తీసుకున్న నిర్ణయం ప్రకారం టిక్ టాక్ యూఎస్ ఆపరేషన్స్ ను అమెరికా సంస్థలకు 45 రోజులలో అమ్మవల్సివుంది.

తర్వాత ట్రంప్ సర్కార్ మరో 45 రోజులు గడువును పెంచింది.నేషనల్ సెక్యూరిటీ రీత్యా అమెరికా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు అప్పట్లో ట్రంప్ ప్రకటించారు.

చైనా మూలాలు ఉన్న కంపెనీలు చైనా ప్రభుత్వంతో ఒక అగ్రిమెంట్ ను సైన్ చేసుకున్నాయి.

దాని ప్రకారం చైనా సంస్థలు తమ యూజర్ డేటాను చైనా ప్రభుత్వంతో అవసరమైన సమయంలో షేర్ చేసుకోవచ్చు.

ఈ నియమాన్ని నామమాత్రంగా పెట్టిన చైనా యూజర్ డేటా ను ఆ సంస్థల నుండి రెగ్యులర్ గా తీసుకుంటుందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయిని ఆ కారణం చేతనే చైనా మూలాలు ఉన్న టిక్ టాక్ పై ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నట్లు గతంలో ట్రంప్ అభిప్రాయపడ్డారు .

బత్తాయి తోటల్లో పురుగుల ఉధృతి నివారణకు సమగ్ర సస్యరక్షక చర్యలు..!