టిక్ టాక్ పిచ్చి పట్టింది.. వీడియో తీసి.. వ్యక్తి ఆత్మహత్య.. !

టిక్ టాక్ వీడియో యాప్ కు మన దేశంలో రోజురోజుకు ప్రజాదరణ పెరుగుతున్న విషయం తెలిసిందే.

కానీ ఈ యాప్ కరోనా వైరస్ కంటే ఎక్కువగా మనుషులపై ప్రభావం చూపుతోంది.

ఈ యాప్ కు బానిసలై కొందరు తమ జీవితాలను నాశనం చేసుకుంటోంటే కొందరు మాత్రం ఏకంగా ఆత్మహత్యలు చేసుకుంటూ ఉండటం గమనార్హం.

తాజాగా టిక్ టాక్ యాప్ కు బానిసై ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.

కర్ణాటక రాష్ట్రంలోని దావణెగెరె జిల్లా మాగనహల్లిలో నాగరాజు టిక్ టాక్ యాప్ ను తన భార్య కంటే ఎక్కువగా ఇష్టపడేవాడు.

నాగరాజు టిక్ టాక్ పిచ్చిని చూసీ చూసీ అతని మొదటి భార్య అతనికి విడాకులు ఇచ్చి అతనికి దూరంగా జీవిస్తోంది.

మొదటి భార్య దూరమైన తరువాత నాగరాజు మరో యువతిని వివాహం చేసుకున్నాడు.కానీ భర్త తనతో కంటే టిక్ టాక్ తోనే ఎక్కువ సమయం గడిపేస్తూ ఉండటంతో ప్రవర్తన మార్చుకోమని రెండో భార్య పలుమార్లు హెచ్చరించింది.

తన కంటే తన భర్తకు టిక్ టాకే ముఖ్యమని గ్రహించి అతని భార్య అతనిని వదిలేసి దూరంగా వెళ్లిపోయింది.

రెండవ భార్య కూడా వదిలేసి వెళ్లటంతో నాగరాజు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.ఆ తరువాత రెండో భార్య కూడా వెళ్లిపోయిన జీవితం తనకు అవసరం లేదని టిక్ టాక్ లో ఆత్మహత్య చేసుకుంటున్నట్టు పోస్ట్ చేసి ఆ తరువాత ఉరి వేసుకున్నాడు.

టిక్ టాక్ లాంటి యాప్ లకు బానిసలుగా మారితే ఎలాంటి పరిస్థితి వస్తుందో ఇలాంటి ఘటనల ద్వారా తెలుసుకొని యువత ఇలాంటి యాప్ ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

వ్యూహం అదిరింది బాబాయ్ .. !