మహా శివరాత్రికి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు:జిల్లా ఎస్పీ

సూర్యాపేట జిల్లా: జిల్లాలో అత్యంత ప్రసిద్ది చెందిన మేళ్లచెరువు జాతరకు మహా శివరాత్రి సందర్భంగా లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ఎలాంటి అసౌకర్యం కలుగకుండా పోలీసు శాఖ ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ తెలిపారు.

మంగళవారం ఆయన మేళ్ళచెరువు ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం మహా శివరాత్రిసందర్భంగా జరుగుతున్న జాతరకు సంభందించి పోలీసు బందోబస్తు ఏర్పాట్లు,వాహనాల మళ్లింపు,వాహనాల పార్కింగ్,జాతర ప్రాంగణం,దేవాలయ ప్రాంగణం పరిశీలన ఏర్పాట్లను పరిశీలించారు.

అమెరికా : విహారయాత్రలో విషాదం.. సరస్సులో మునిగి ఇద్దరు భారతీయ విద్యార్ధులు మృతి