మంచిర్యాల జిల్లాలో పులి కలకలం

మంచిర్యాల జిల్లాలో పులి కలకలం రేపింది.మల్లంపేట నీల్వాయి రోడ్డు సమీపంలో టైగర్ సంచరించినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలో రోడ్డు పక్కన పులి పాదముద్రలను గుర్తించిన ఓ వాహనదారుడు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాడు.

దీంతో మల్లంపేట నీల్వాయి ప్రాంతానికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు ఏడాదిన్నర వయసు కలిగిన పులిగా గుర్తించారు.

పులి మహారాష్ట్ర అడవుల నుంచి వచ్చిందా కాగజ్ నగర్ అడవుల నుంచి వచ్చిందా అనేది అధికారులు పరిశీలిస్తున్నారు.

పులి సంచారంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

వైరల్ వీడియో: పెద్దాయనే కానీ మహానుభావుడు..