టైగర్ నాగేశ్వరరావు ట్విట్టర్ రివ్యూ.. మరి ఇంత విధ్వంసమా..?

మాస్ మహారాజ రవితేజ ( Ravi Teja )మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు ఈ రోజు రాబోతున్నాడు.

తాజాగా ఈయన టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ చేసాడు.వాల్తేరు వీరయ్య, ధమాకా వంటి బ్లాక్ బస్టర్స్ అందుకుని మరింత ఉత్సాహంగా ఈ సినిమాను పూర్తి చేసి రిలీజ్ కు కూడా రెడీ అయ్యాడు.

ప్రస్తుతం రవితేజ చేస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ''టైగర్ నాగేశ్వరరావు''.నూతన డైరెక్టర్ వంశీ( Director Vamsee ) దర్శకత్వంలో భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో రవితేజ కూడా పాన్ ఇండియా స్టార్ గా మారనున్నాడు.

మరి మొదటిసారి పాన్ ఇండియన్ సినిమా చేస్తుండడంతో ఈయన ఎలాంటి హిట్ అందుకుంటాడా అని ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తున్నారు.

పాన్ ఇండియా లెవల్లో ప్రమోషన్స్ కూడా బాగా చేసి ఈ సినిమాను ప్రేక్షకులకు చేరువ చేసారు.

"""/" / మరి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ప్రేక్షకులకు ఈ రోజుతో ఎదురు చూపులకు ఫుల్ స్టాప్ పడింది.

ఈ సినిమాలో రవితేజ సరసన నుపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్స్ గా నటించారు.

అలాగే జివి ప్రకాష్ కుమార్ స్వరాలు అందించగా అక్టోబర్ 20న ఈ రోజు గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.

ఇప్పటికే యూఎస్ లో ప్రీమియర్స్ పడగా ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను ఫ్యాన్స్ పంచుకుంటున్నారు.

"""/" / ఈ సినిమాను వంశీ తీర్చిదిద్దిన తీరు ఆడియెన్స్ ను అలరిస్తుంది.

సాధారణ వ్యక్తిగా ఉన్న ఒక యువకుడు గజదొంగగా మారి ప్రభుత్వాలను, దేశాన్ని ఎలా శాసిస్తాడు అనే కథకు కాస్తంత ఫిక్షన్ యాడ్ చేసి కథను నడిపించిన తీరు ఆకట్టుకుంది.

ఫస్టాఫ్ మొత్తం యాక్షన్ తో పాటు దొంగతనాలను చూపించి ఆకట్టుకున్నారు.టైగర్ నాగేశ్వరరావు( Tiger Nageswara Rao ) బాల్యం, దొంగగా మారడానికి దారి తీసిన పరిస్థితులను తెరకెక్కించిన విధానం ఆకట్టుకుంది.

ఫస్టాఫ్ మొత్తం స్క్రీన్ ప్లే మీద పరుగులు పెట్టిన విధానం ప్రేక్షకులకు మంచి అనుభూతిని కలిగిస్తుంది.

సెకండాఫ్ నిడివి కారణంగా కాస్తంత లాగ్ చేసినట్టు అనిపిస్తుంది.ఈ సినిమా నిర్మాణ విలువలు, విఎఫ్ఎక్స్, మ్యూజిక్ కు మంచి మార్కులు పడతాయి.

మొత్తానికి ఈ మూవీతో మాస్ రాజా ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.

బీచ్‌లో బోల్డ్ లుక్స్‌లో పిచ్చెక్కిస్తున్న శ్రీయా