‘టైగర్ నాగేశ్వరరావు’ నుండి సెకండ్ సింగిల్ అప్డేట్.. ఎప్పుడంటే?

మాస్ మహారాజా రవితేజ( Ravi Teja ) నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ''టైగర్ నాగేశ్వరరావు( Tiger Nageswara Rao )''.

నూతన డైరెక్టర్ వంశీ దర్శకత్వంలో భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో రవితేజ కూడా పాన్ ఇండియా స్టార్ గా మారడానికి సిద్ధం అవుతున్నాడు.

ఈ సినిమాపై ముందు నుండి అంచనాలు ఉన్నాయి.ఇక ఫస్ట్ లుక్ పోస్టర్ అండ్ గ్లింప్స్ తో అంచనాలు డబుల్ అయ్యాయి.

"""/" / ఇటీవలే ఈ సినిమా నుండి టీజర్ రిలీజ్ చేసి అంచనాలు పీక్స్ కు చేర్చారు.

ప్రజెంట్ శరవేగంగా షూటింగ్ పూర్తి చేస్తూనే మరో పక్క ఒక్కో అప్డేట్ ఇస్తూ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసారు.

ఈ క్రమంలోనే ఇటీవలే ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసారు.ఇక ఇప్పుడు సెకండ్ సింగిల్ గురించి మేకర్స్ అప్డేట్ ఇచ్చారు.

ఈ రోజు సాయంత్రం 4.59 నిముషాలకు సెకండ్ సింగిల్ గురించి అప్డేట్ ఇస్తామంటూ తెలిపారు.

"""/" / మరి మొదటి సాంగ్ డ్యూయెట్ సాంగ్ కాగా రెండవ సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి.

కాగా నిజ జీవిత సంఘటనలతో 1970ల కాలంలో గజదొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నుపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

ఈ సినిమాకు జివి ప్రకాష్ కుమార్ స్వరాలు అందిస్తుండగా అక్టోబర్ 20న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

ఇక అనుపమ్ ఖేర్, రేణు దేశాయ్, జిషు సేన్ గుప్తా కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా రవితేజ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్రేక్ ఇస్తుందో లేదో వేచి చూడాలి.

ఇక రవితేజ ఈ సినిమాతో పాటు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో 'ఈగల్' సినిమా( EAGLE ) చేస్తున్నాడు.

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా 2024 సంక్రాంతికి రిలీజ్ కాబోతుంది.

అలాగే దీంతో పాటు గోపీచంద్ మలినేని సినిమాను కూడా సెట్స్ మీదకు తీసుకువెళ్లే అవకాశం ఉంది.