టైగర్ నాగేశ్వరరావు ఫస్ట్ డే బుకింగ్స్ అలా ఉన్నాయా.. ఆ సినిమా పైచేయి సాధిస్తోందా?

ప్రస్తుత కాలంలో పెద్ద సినిమాలకు ఫస్ట్ డే కలెక్షన్లు కీలకమనే సంగతి తెలిసిందే.

ఫస్ట్ డే రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తే మాత్రమే పెద్ద సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించే అవకాశాలు ఉంటాయి.

టైగర్ నాగేశ్వరరావు సినిమా( Tiger Nageswara Rao ) విషయానికి వస్తే ఈ సినిమా బుకింగ్స్ ఇప్పటికే మొదలయ్యాయి.

3 గంటల ఒక నిమిషం నిడివితో ఈ సినిమా థియేటర్లలో విడుదలవుతోంది.ఇంత నిడివి వల్ల సింగిల్ స్క్రీన్స్ లో టైమింగ్స్ మార్చాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

ఏఏఏ సినిమాస్, ఏఎంబీ మల్టీప్లెక్స్, ప్రసాద్ మల్టీప్లెక్స్ లో ఈ సినిమాకు బుకింగ్స్( Tiger Nageswara Rao Bookings ) బాగానే ఉన్నాయి.

మిగతా థియేటర్లలో మాత్రం బుకింగ్స్ పుంజుకోవాల్సి ఉంది.టైగర్ నాగేశ్వరరావు కలెక్షన్లు రికార్డ్ స్థాయిలో ఉండాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

"""/" / రవితేజ కెరీర్ కు ఈ సినిమా సక్సెస్ కీలకం కాగా ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో చూడాల్సి ఉంది.

విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా టైగర్ నాగేశ్వరరావు దసరా విన్నర్ అనే స్టేట్మెంట్ ఇచ్చారు.

"""/" / ఆ స్టేట్మెంట్ ను ఈ సినిమా నిజం చేస్తుందో లేదో చూడాల్సి ఉంది.

రవితేజ( Raviteja ) ఈ మధ్య కాలంలో ఎంతో కష్టపడిన సినిమా టైగర్ నాగేశ్వరరావు అని తెలుస్తోంది.

ఈ సినిమా కమర్షియల్ గా రికార్డులు క్రియేట్ చేయాల్సి ఉంది.రేణు దేశాయ్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించారు.

రేణు దేశాయ్ రీఎంట్రీకి సైతం ఈ సినిమా కీలకమని చెప్పవచ్చు.ఈ సినిమా రేణుదేశాయ్( Renu Desai ) స్థాయిని పెంచుతుందేమో చూడాలి.

70 కోట్ల రూపాయల బడ్జెట్( Tiger Nageswara Rao Budget ) తో తెరకెక్కిన ఈ సినిమాకు బిజినెస్ బాగానే జరిగింది.

ఇతర భాషల్లో కూడా టైగర్ నాగేశ్వరరావు మూవీ హవా ఉంటుందని ఫ్యాన్స్ భావిస్తుండగా ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.

థియేటర్ల విషయంలో కూడా ఈ సినిమాకు అన్యాయం జరుగుతోందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఎన్టీఆర్ సినిమాలలో హృతిక్ రోషన్ కు ఆ సినిమా అంటే అంత ఇష్టమా…అలా ఫీలయ్యారా?