విజయనగరం జిల్లాలో పులి సంచారం కలకలం
TeluguStop.com
విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలంలో పులి సంచారం కలకలం సృష్టిస్తోంది.ఉత్తరవల్లి పంచాయతీ గధబపేటలో పులి అడుగుజాడలను గుర్తించారు.
దీంతో సమీప గ్రామ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.సమాచారం అందుకున్నఫారెస్ట్ అధికారులు.
పులి కోసం గాలిస్తున్నారు.సమీప గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.