శ్రీకాకుళం జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం

శ్రీకాకుళం జిల్లాలో పెద్దపులి సంచారం తీవ్ర కలకలం సృష్టించింది.ఎల్ ఎన్ పేట మరియు సరుబుజ్జిలి మండలాల్లో పులి సంచరిస్తుందని స్థానికులు చెబుతున్నారు.

ఈ క్రమంలోనే జంబాడ సమీపంలో పెద్దపులి గొర్రెపై దాడి చేసి చంపేసింది.దీంతో రెండు మండలాల పరిధిలోని ప్రజలందరూ తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

ఎప్పుడు ఎటువైపు నుంచి వచ్చి దాడి చేస్తుందేమోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతుకుతున్నారు.

పులి సంచారం నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచించారు.

అనంతరం పులి సంచరించిన ప్రాంతాలను పరిశీలించారు.

స్టార్ హీరోతో సినిమా ప్లాన్ చేస్తున్న కొరటాల శివ