ఇండియాలోకి త్వరలోనే ఎంట్రీ ఇవ్వబోతున్న టిక్‌టాక్...?

భారతదేశంలో టిక్‌టాక్ బ్యాన్ కు గురైన విషయం విదితమే.ఈ షార్ట్ వీడియో షేరింగ్ అప్లికేషన్ కు కోట్లాది మంది భారతీయులు అలవాటుపడ్డారు.

అంతేకాదు కొందరికి టిక్‌ టాక్ లేనిదే పూట గడవదు అనే పరిస్థితి వచ్చిందంటే అతిశయోక్తి కాదు.

దీని ద్వారా డబ్బు సంపాదించిన వారు కూడా ఉన్నారు.అయితే ఇప్పటికే టిక్‌టాక్ బ్యాన్ అయ్యి చాలా రోజులు గడుస్తోంది.

ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఆసక్తికరమైన వార్త వెలుగులోకి వచ్చింది.టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ టిక్‌టాక్‌ను కొనేందుకు సిద్ధం అయిందని ప్రస్తుతం విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి.

దీంతో త్వరలోనే భారతదేశంలో టిక్‌టాక్ ఎంట్రీ ఇవ్వవచ్చని తెలుస్తోంది.ఇది టిక్‌టాక్ ఫ్యాన్స్ కు ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు.

అయితే టిక్‌టాక్ భారతదేశంలో అందుబాటులోకి వస్తే దేశీయ యాప్స్ నష్టపోయే అవకాశం ఉంది.

ఇప్పుడు భారతదేశానికి చెందిన షార్ట్ వీడియో యాప్స్‌నే కోట్లాది మంది భారతీయులు వినియోగిస్తున్నారు.

టిక్‌ టాక్ రంగప్రవేశం చేస్తే ఈ యాప్స్ యూజర్ల సంఖ్య తగ్గి పోయే అవకాశం లేకపోలేదు.

ఈ విషయంపై ప్రస్తుతం భారత్ చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.టిక్‌ టాక్ ఇండియాను మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేయనుండగా.

టిక్‌ టాక్ యూఎస్‌ను ట్విట్టర్ కొనుగోలు చేసేందుకు సిద్ధం అయిందని అమెరికన్ వార్తా సంస్థలు పేర్కొంటున్నాయి.

"""/" / టిక్‌టాక్ నిషేధానికి గురైన తర్వాత దేశీయ యాప్స్ జనాదరణ పొందాయి.

దీనితో ఇన్వెస్టర్లు వీటిపై పెట్టుబడులు పెడుతున్నారు.మరిన్ని పెట్టుబడులు పెట్టే అవకాశం కూడా ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

ఇలాంటి సమయంలో ఇండియాలో మళ్లీ టిక్‌ టాక్ ప్రవేశిస్తే ఇన్వెస్టర్లు అందరూ దేశీయ యాప్‌లపై ఇన్వెస్ట్ చెయ్యరు.

అందుకు బదులుగా టిక్‌ టాక్ యాప్‌పై పెట్టుబడులు పెడతారు.ఇందుకు ప్రధాన కారణం టిక్‌ టాక్ లో పెట్టుబడులు పెడితే ఎక్కువ లాభాలు రావడమేనని పెట్టుబడి దారులు భావించడమే! అయితే ఇదే జరిగితే భారతీయ యాప్‌ నిర్వాహకులు బాగా నష్ట పోవచ్చు.

టీ గ్లాస్ పట్టుకున్న స్టార్ హీరో అల్లు అర్జున్.. ఆ పార్టీకి ప్రచారం చేస్తున్నారా అంటూ?