తెలంగాణలో కాంగ్రెస్ లో టికెట్ల పంచాయితీ..!

తెలంగాణలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో అధికారమే ధ్యేయంగా పార్టీలన్నీ తీవ్ర కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే తెలంగాణ కాంగ్రెస్ లో టికెట్ల పంచాయితీ మొదలైంది.టికెట్లు ఎవరికి కేటాయిస్తారన్న అంశంపై అభ్యర్థుల్లో గందరగోళం నెలకొంది.

మరోవైపు కాంగ్రెస్ కు కీలక నేతలు రాజీనామా చేస్తున్నారు.తాజాగా మెదక్ జిల్లా డిసిసి అధ్యక్షుడు తిరుపతి రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు.

మొదటినుంచి కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన తమను కాదని కొత్తవారిని మండలం ఎక్కిస్తున్నారంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

కాగా మెదక్ టికెట్ ను మైనంపల్లి రోహిత్ కు పార్టీ ఖరారు చేసిన సంగతి తెలిసిందే.

మరోవైపు టికెట్లు అమ్ముకుంటున్నారంటూ నేతల ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.మహేశ్వరం నియోజకవర్గం నేత కొత్త మనోహర్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే రూ.10 కోట్లకు రేవంత్ రెడ్డి టికెట్లు అమ్ముకుంటున్నారని ఆరోపించారు.

Happy Luke Bonuses: A Practical Breakdown For UK Players