ఖమ్మం అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థిగా తుమ్మల నామినేషన్

ఖమ్మం అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు నామినేషన్ దాఖలు చేశారు.

నామినేషన్ వేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఖమ్మం ప్రజల అవసరాలను తీర్చడానికి కృషి చేస్తానని తెలిపారు.

కాంగ్రెస్ తోనే ప్రజాహితమైన పాలన సాధ్యమని తుమ్మల నాగేశ్వర రావు వెల్లడించారు.ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజలంతా కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని కోరారు.

తాము అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు.

బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం నాశనమైందన్న ఆయన కాంగ్రెస్ తోనే ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి సాధ్యమని తెలిపారు.

బాలయ్య బోయపాటి మూవీలో స్టార్ హీరోయిన్ కూతురు.. ఆ పాత్రలో కనిపిస్తారా?