ఢిల్లీలో రాహుల్ గాంధీతో తుమ్మల కీలక భేటీ..!

మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కాంగ్రెస్ హైకమాండ్ పిలుపుతో ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే.

ఇందులో భాగంగా ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో తుమ్మల భేటీ అయ్యారు.

కాంగ్రెస్ పార్టీలో చేరిన తరువాత తుమ్మల తొలిసారి రాహుల్ గాంధీతో సమావేశం అయ్యారు.

పార్టీలో చేరిన రోజు భేటీ కావడం కుదరకపోవడంతో రాహుల్ గాంధీ తుమ్మలను ఢిల్లీకి పిలిపించారని తెలుస్తోంది.

దాదాపు అరగంట పాటు కొనసాగిన సమావేశంలో భాగంగా రాష్ట్ర రాజకీయాలతో పాటు భవిష్యత్ లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారని సమాచారం.

అదేవిధంగా ఖమ్మం జిల్లా రాజకీయాలపై కూడా ప్రధానంగా చర్చించారు.రాహుల్ గాంధీతో సమావేశం ముగిసిన అనంతరం కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో తుమ్మల నాగేశ్వర రావు సమావేశం అయ్యారు.

వైరల్ వీడియో: పాముతో పరచకాలు చేస్తే.. రిజల్ట్ ఇట్లే ఉంటది మరి