ఫైనల్ గా ఆ నిర్ణయం తీసేసుకున్న తుమ్మల ?
TeluguStop.com
తెలంగాణ లో కీలక నేత , మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావు( Tummala Nageswararao ) రాజకీయ అడుగులు ఎటువైపు అనేది క్లారిటీ వచ్చేసింది.
బీఆర్ఎస్ లో మొదట్లో ఆయనకు బాగానే ప్రాధాన్యం దక్కినా, 2018 ఎన్నికల ఫలితాలు దగ్గర నుంచి కెసిఆర్ తుమ్మలను దూరం పెడుతూనే వచ్చారు.
ఆయనకు రాజ్యసభ సభ్యత్వం ఇస్తామంటూ చాలాకాలంగా హామీ ఇస్తూనే వచ్చారు.కానీ ఆ అవకాశం తుమ్మలకు దక్కలేదు.
ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి మంత్రి పదవి కేటాయిస్తారని తుమ్మల ఆశలు పెట్టుకున్నారు కానీ, పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ తనకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకపోవడం, పార్టీలోని తన వ్యతిరేక వర్గాన్ని ఎక్కువగా ప్రోత్సహించడం వంటి కారణాలతో బీఆర్ఎస్( BRS ) లో అసంతృప్తితో ఉంటూ వస్తున్నారు.
ఈ క్రమంలోనే ఆయన పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు.ముందుగా ఆయన బిజెపిలో చేరుతారనే హడావుడి జరిగినా, చివరకు కాంగ్రెస్ లో చేరాలని డిసైడ్ అయిపోయారు .
ఎప్పటి నుంచో ఆయన చేరికపై ఉత్కంఠ నెలకొంటూనే వచ్చింది .తాజాగా ఆయన కాంగ్రెస్ లో చేరాలని ఫైనల్ గా డిసైడ్ అయిపోయారు ఈ మేరకు ఈ నెల 17న కాంగ్రెస్ లో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
"""/" /
ఈ క్రమంలోనే తుమ్మల నాగేశ్వరరావు తో తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి,( Revanth Reddy ) తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్రావు టాక్రే , సీఎల్పీ నేత మల్లు బట్టు విక్రమార్క , ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు భేటీ అయ్యారు ఈ సందర్భంగా కాంగ్రెస్ లో చేరేందుకు తుమ్మల సిద్ధమనే సంకేతాలు ఇచ్చారట ఈనెల 17న హైదరాబాదులో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ సమక్షంలో తుమ్మల కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారు హైదరాబాదులో సిడబ్ల్యుసి సమావేశం జరగనుంది.
అలాగే భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. """/" /
ఈ సమావేశానికి కాంగ్రెస్ కీలక నేతలు రాహుల్ గాంధీ ,( Rahul Gandhi ) ప్రియాంక గాంధీ మల్లికార్జున ఖర్గే తదితర నేతలు హాజరు కాబోతున్నారు.
వారి సమక్షంలోనే తుమ్మల కాంగ్రెస్ లో చేరనున్నారు.ఇక అదే సభలో సోనియా గాంధీ చేతుల మీదుగానే తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టోను విడుదల చేసేందుకు ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం సిద్ధమవుతోంది.
ఇక తుమ్మల తో పాటు భారీగా అనుచరులు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమవుతున్నారు.
డాకు మహారాజ్ మూవీ హిందీ వెర్షన్ కు అదే మైనస్ అయిందా.. ఏం జరిగిందంటే?