మూడు పార్టీల ” ఆపరేషన్ ఆకర్ష్ ” !

తెలంగాణలో( Telangana ) ఎన్నికలు దగ్గర పడుతుండడంతో మూడు ప్రధాన పార్టీలు ఆపరేషన్ ఆకర్ష్ ( Operation Akarsh )పై గట్టిగా దృష్టి పెట్టాయి.

ప్రత్యర్థి పార్టీల నుంచి వీలైనంతా ఎక్కువగా చేరికలను ఆహ్వానించాలని అధికార బి‌ఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి.

చేరికల విషయంలో మొదటి నుంచి బీజేపీ హడావిడి చేస్తూనే ఉంది.ఆ మద్య చేరికల కమిటీ చైర్మెన్ గా ఈటెల రాజేందర్( Etela Rajender ) ను నియమించి పెద్ద ఎత్తున చేరికలను ఆహ్వానించే ప్రయత్నం చేసింది.

కానీ ఆ పదవిపై ఈటెల సంతృప్తిగా లేకపోవడం.అనుకున్న స్థాయిలో చేరికలు లేకపోవడంతో కొంత డీలా పడింది కాషాయ పార్టీ.

"""/" / ఈలోగా కర్నాటక ఎన్నికల్లో ( Karnataka Elections )ఓడిపోవడంతో ఆ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ ను పూర్తిగా పక్కన పెట్టి పార్టీ ప్రక్షాళనపై దృష్టి పెట్టింది.

ఇక పదవుల విషయంలో గత కొన్ని రోజులుగా నెలకొన్న గందరగోళం ఓ కొలిక్కి రావడంతో మళ్ళీ ఆపరేషన్ ఆకర్ష్ ను షురూ చేసింది.

అటు బి‌ఆర్‌ఎస్ నుంచి ఇటు కాంగ్రెస్ నుంచి పక్కా వ్యూహరచనతో చేరికలకు రంగం సిద్దం చేసుకుంటోంది.

ఇప్పటికే కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్, మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డిని పార్టీలో చేరుకుంది.

ఇంకా కాంగ్రెస్ నుంచి మరో 15-20 మంది మాజీ ఎమ్మెల్యేలతో కమలనాథులు మంతనాలు చేస్తున్నారట.

ఇక హస్తం పార్టీ కూడా ఈ మద్య ఆపరేషన్ ఆకర్ష్ పై గట్టిగా ఫోకస్ పెట్టింది.

ముఖ్యంగా అధికార బి‌ఆర్‌ఎస్ నే లక్ష్యంగా చేసుకొని నేతలను ఆకర్షించే పనిలో ఉంది.

"""/" / బి‌ఆర్‌ఎస్ బహిష్కృత నేతలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణరావులకు ఆశ్రయమిచ్చిన హస్తం పార్టీ.

మరికొంత మందికి గాలం వేసే పనిలో ఉంది.అయితే ఆపరేషన్ ఆకర్ష్ విషయంలో బి‌ఆర్‌ఎస్ వైఖరి మాత్రం కాస్త భిన్నంగా ఉంది.

చేపకింద నీరులా ఇతర పార్టీల నేతలను ఆహ్వానించే పనిలో ఉన్నారు కే‌సి‌ఆర్.ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లా, మేదక్ జిల్లా నుంచి కాంగ్రెస్ నేతలు బి‌ఆర్‌ఎస్ తో టచ్ లో ఉంటున్నట్లు టాక్.

పార్టీలో చేరిన వారికి కుదిరితే ఎమ్మెల్యే టికెట్ లేదా ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చేందుకు కే‌సి‌ఆర్ సిద్దంగా ఉన్నాడనే టాక్ రావడంతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి అసంతృప్త నేతలు సీటు దక్కని వారంతా.

బి‌ఆర్‌ఎస్ గూటికి చేరేందుకు రెడీగా ఉన్నారట.ఇలా మొత్తానికి ఆపరేషన్ ఆకర్ష్ విషయంలో మూడు పార్టీలు కూడా దూకుడుగానే ఉన్నాయి.

సూపర్ స్టార్ మహేష్ బాబు ఆ సినిమాకు రెమ్యునరేషన్ తీసుకోలేదా.. మంచి హీరో అంటూ?