ఎమ్మెల్సీ స్థానాల్లో బీసీలకు మూడు ఎమ్మెల్సీ స్థానాలు కేటాయించాలి….!

నల్లగొండ జిల్లా: త్వరలో భర్తీ కానున్న ఐదు ఎమ్మెల్సీ స్ధానాల్లో బీసీలకు మూడు స్థానాల్లో అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కి లేఖ రాసినట్లు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ తెలిపారు.

శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీకి మొదటి నుంచి బీసీలు అండగా ఉన్నారని జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలకు అదే స్థాయిలో గౌరవ ప్రదమైన పదవులు ఇవ్వాలని లేఖలో పేర్కొన్నాట్లు చెప్పారు.

చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు లేకపోవడం వల్ల రాజకీయంగా ఎదగలేకపోతున్నారని,మంత్రి పదవులు కూడా బీసీలు కేవలం ముగ్గురు మాత్రమే ఉన్నారని గుర్తు చేశారు.

అనంతరం కేసీఆర్ కి రాసిన లేఖను పోస్ట్ చేశారు.ఈ కార్యక్రమంలో బంటు వెంకటేశ్వర్లు,రవి, చేగొండి మురళి,అంజి, వెంకటేశ్వర్లు,వంశీ తదితరులు పాల్గొన్నారు.

ముసలి వయసులో లవ్ చేసింది.. కట్ చేస్తే 4 కోట్లు గోవిందా..