రోజుకి మూడు సభలు … రంగంలోకి దిగుతున్న పవన్ కళ్యాణ్
TeluguStop.com
జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఎన్నికల కథన రంగంలోకి దిగుతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా పర్యటించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.ఎన్నికలకు కొద్ది నెలలు మాత్రమే సమయం ఉండడంతో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని, మెజారిటీ సీట్లను సాధించాలనే లక్ష్యంతో పవన్ ఉన్నారు.
దీనిలో భాగంగానే టీడీపీతో( TDP ) పొత్తు పెట్టుకోవడంతో పాటు , ఆ పార్టీతో సమన్వయం తో ముందుకు వెళ్లే విధంగా పవన్ అనేక నిర్ణయాలు తీసుకుంటున్నారు.
ఈ మేరకు వచ్చే ఎన్నికలను టార్గెట్ చేసుకుని ఈ నెలాఖరు నుంచి పవన్ కళ్యాణ్ క్షేత్రస్థాయిలో పర్యటనలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు.
ఈ మేరకు భారీ బహిరంగ సభలను నిర్వహించేందుకు జనసేన ఏర్పాట్లు చేసుకుంటుంది .
ఈ విషయాన్ని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ( Chairman Nadendla Manohar )వెల్లడించారు.
గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం పార్టీ జోనల్ కమిటీ సభ్యులతో నిర్వహించిన సమావేశంలో మనోహర్ దీనికి సంబంధించి వివరాలను ప్రకటించారు .
"""/" /
పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించడంతో పాటు , ప్రతి శాసనసభ నియోజకవర్గంలో బహిరంగ సభలో ఏర్పాటు చేసేలా ప్రణాళిక రూపొందించారు.
ఈ మేరకు రోజుకు మూడు సభల్లో పవన్ పాల్గొంటారు.ఈ సభలను విజయవంతం చేసే బాధ్యతను జోనల్ కమిటీలు తీసుకోవాలి అని నాదెండ్ల పిలుపునిచ్చారు.
అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాల్లోనూ పవన్ పర్యటించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
"""/" /
టిడిపి, జనసేన( TDP, Jana Sena ) మధ్య టిక్కెట్ల పంపకాలు పూర్తయి, అభ్యర్థులను ప్రకటించిన తర్వాత మరింత స్పీడ్ పెంచేందుకు సిద్ధమవుతున్నారు.
ఇక పవన్ పర్యటనకు సంబంధించి రాష్ట్రాన్ని ఐదు జోన్లుగా విభజించి 191 మందితో కమిటీలను వేశారు.
మార్చి నెలాఖరులోగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోనూ పవన్ పర్యటించేలా ప్రణాలికలు రూపొందిస్తున్నారు.పవన్ బహిరంగ సభలో పూర్తిగా వైసిపి ప్రభుత్వాన్ని, జగన్ ను టార్గెట్ చేసుకుని వచ్చే ఎన్నికల్లో టిడిపి, జనసేన ప్రభుత్వం ఏర్పడితే ప్రజలకు ఏ విధంగా మంచి పరిపాలనను అందిస్తామో పవన్ చెప్పనున్నరట.
అల్లు, మెగా ఫ్యామిలీలు కలిసిపోయినట్టేనా.. ఈ కుటుంబాల మధ్య గ్యాప్ తగ్గుతుందా?