వైసీపీలో ముగ్గురు మ‌రాఠాలు.. జ‌గ‌న్ ద‌గ్గ‌ర తిరుగులేని మార్కులు కొట్టేశారే ?

వైసీపీలో ముగ్గురు మ‌రాఠాలు జ‌గ‌న్ ద‌గ్గ‌ర తిరుగులేని మార్కులు కొట్టేశారే ?

చిత్తూరు వైసీపీలో ముగ్గురు కీల‌క‌ నాయ‌కులు త‌మ స‌త్తా చాటుకున్నారు.వీరిలో ఇద్ద‌రు మంత్రులు కాగా, మ‌రొక‌రు ఎమ్మెల్యే కావ‌డం విశేషం.

వైసీపీలో ముగ్గురు మ‌రాఠాలు జ‌గ‌న్ ద‌గ్గ‌ర తిరుగులేని మార్కులు కొట్టేశారే ?

ప్ర‌స్తుతం ఈ విష‌యంపైనే వైసీపీలో చ‌ర్చ జ‌రుగుతోంది.వాస్త‌వానికి త్వ‌ర‌లోనే మంత్రి ప‌ద‌వుల మార్పు ఉంటుంద‌నే నేప‌థ్యంలో వ‌చ్చిన పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో త‌మ స‌త్తా చాటుకునేందుకు మంత్రులు చాలానే కృషి చేశారు.

వైసీపీలో ముగ్గురు మ‌రాఠాలు జ‌గ‌న్ ద‌గ్గ‌ర తిరుగులేని మార్కులు కొట్టేశారే ?

ఇక‌, ఇదేస‌మ‌యంలో ఎమ్మెల్యేలు కూడా త‌మ స‌త్తాచాటుకుని.జ‌గ‌న్ ద‌గ్గ‌ర మంచి మార్కులు సంపాయించి.

మంత్రి పీఠాలు ద‌క్కించుకునేందుకు ప్ర‌య‌త్నించారు.వీరిలో ఇప్పుడు చిత్తూరుకు చెందిన ముగ్గురు స‌క్సెస్ అయ్యార‌నేది వైసీపీ నేత‌ల టాక్‌.

డిప్యూటీ సీఎం నారాయణ స్వామీ, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి, ఎమ్మెల్యే రోజాలు త‌మ తమ నియోజకవర్గాల్లో అధికార పార్టీకి మెజార్టీ స్థానాలు దక్కేలా చూసుకున్నారు.

మంత్రి పెద్దిరెడ్డి త‌న‌ సొంత నియోజకవర్గం పుంగనూరులో స‌త్తా చాటారు. మొత్తం 95 పంచాయతీలను ఏకగ్రీవం చేసుకుని ప్రత్యర్ధులకు కోలుకోలేని షాక్ ఇచ్చారు.

వెయ్యికిపైగా ఉన్న వార్డులను సైతం ఏకగ్రీవంగా గెలిపించుకున్నారు.దీంతో జిల్లాలో పెద్దిరెడ్డికి తిరుగులేద‌నే టాక్ మ‌రోసారి రుజువైంద‌ని అంటున్నారు పార్టీ నాయ‌కులు .

"""/"/ ఇక డిప్యూటీ సిఎం నారాయణ స్వామి.తన నియోజక వర్గంలో 137 పంచాయతీలుంటే.

120 చోట్ల వైసీపీ మద్దతుదారుల్ని గెలిపించుకున్నారు.అయితే జిల్లాలో ఏ నేతకూ ఎదురుకాని  రెబల్స్ సమస్యను ఆయన ఎదుర్కొన్నారు.

అయినా కూడా వారిని కూడా స‌మ‌ర్ధంగా లైన్‌లోకి తెచ్చుకుని ముందుకు సాగారు.దీంతో జ‌గ‌న్ ద‌గ్గ‌ర మంచి మార్కులు ప‌డ్డాయ‌ని నారాయ‌ణ స్వామి వ‌ర్గం పండ‌గ చేసుకుంటోంది.

అంతేకాదు, తన పదవికి ఢోకా లేదని.తాను సేఫ్ అని అనుకుంటున్నారట మంత్రిగారు.

"""/"/ ఇక‌, ఏపీఐఐసీ చైర్ ప‌ర్స‌న్.ఎమ్మెల్యే రోజా కూడా ఈ ఎన్నిక‌ల‌నుఅ త్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు.

మంత్రి ప‌ద‌వి ద‌క్క‌క‌పోయినా.త‌న‌కు నియోజ‌క‌వ‌ర్గంలోను.

జిల్లాలోనూ ఎద‌ర‌వుతున్న ఎదురీత నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు ఈ ఎన్నిక‌లు ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌నిఆమె భావిస్తున్నారు. నగరి నియోజకవర్గంలోని 94 పంచాయతీల్లో 74చోట్ల వైసీపీ మ‌ద్ద‌తు దారుల‌ను గెలిపించుకున్నారు.

దీంతో ఇక‌, త‌న‌కు తిరుగులేద‌ని.జ‌గ‌న్ ద‌గ్గ‌ర మంచి మార్కులు ల‌భించిన‌ట్టేన‌ని రోజా భావిస్తున్నార‌ట‌.

మొత్తంగా చూస్తే.చిత్తూరుకు చెందిన ఈ ముగ్గురునాయ‌కులు వైసీపీలో స‌త్తా చాటార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.