న్యూజెర్సీ వేడుకల్లో అపశృతి: కుప్పకూలిన బాల్కనీ, భారీగా క్షతగాత్రులు

న్యూజెర్సీలో మూడంతస్తుల భవనానికి ఆనుకుని వున్న బాల్కనీ కూలిపోయిన ఘటనలో పదుల సంఖ్యలో ప్రజలు గాయాలపాలయ్యారు.

శనివారం సాయంత్రం 6 గంటల సమయంలో న్యూజెర్సీ ఫైర్ డిపార్ట్‌మెంట్ వార్షికోత్సవ వేడుకలను తిలకించేందుకు వైల్డ్‌వుడ్‌‌లోని ఈస్ట్ బేకర్ అవెన్యూ‌ బ్లాక్ నెం.

200 వద్ద పెద్ద సంఖ్యలో జనం గుమిగూడారు.కొందరు ఆ పక్కనే ఉన్న మూడంతస్తుల నివాస సముదాయానికి ఆనుకుని ఉన్న బాల్కనీ మీదకు చేరుకున్నారు.

అయితే అది చెక్కతో చేసినది కావడం.పరిమితికి మించి జనం ఉండటంతో బాల్కనీ ఒక్కసారిగా కూలిపోయింది.

"""/"/  వెంటనే స్పందించిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని శిథిలాలను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు.

పలువురిని రక్షించి దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు.వీరిలో చిన్నారులు, మహిళలు అధిక సంఖ్యలో ఉన్నట్లు సమాచారం.

అయితే శిథిలాల కింద మరింతమంది చిక్కుకుపోయి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.

నాగార్జున సైతం రూట్ మారుస్తున్నారా.. కొడుకు బాటలో ఈ అక్కినేని హీరో పయనిస్తారా?