ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురు అక్కడికక్కడే మృతి

హన్మకొండ జిల్లా శాయంపేట మండలం మందారిపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

కూలీలతో వెళ్తున్న ట్రాలీ వాహనాన్ని లారీ ఢీ కొట్టింది.ఈ ప్రమాదంలో ట్రాలీలో ప్రయాణిస్తున్న ముగ్గురు మహిళా కూలీలు అక్కడికక్కడే మృతిచెందగా ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి.

పూర్తి వివరాలులోకి వెళ్తే శాయంపేట మండలం పత్తిపాక గ్రామానికి చెందిన సుమారు ఇరవై మంది కూలీలు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలో మిర్చీ తోటలో పనికి వెళ్లేందుకు ట్రాలీ వాహనంలో బయలుదేరారు.

ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టడంతో ట్రాలీలో సైడ్‌కు నిలబడిన కూలీలందరినీ గుద్దుకుంటూ వెళ్లింది.

ఈ ఘటన లో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందగా, మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

విషయం తెలుసుకున్న పరకాల ఏసీపీ, శాయంపేట ఎస్సై తో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని గాయపడ్డ వారిని వరంగల్ ఎంజీఎంకు అదే ట్రాలీలో తరలించారు.

No-Deposit Bonuses: Where To Get Free Spins — Insider Tips For High Rollers (CA)