కెనడాలో ముగ్గురు భారతీయ విద్యార్ధుల హత్య .. రంగంలోకి విదేశాంగ శాఖ
TeluguStop.com
కెనడాలో( Canada ) రోజుల వ్యవధిలో ముగ్గురు భారతీయ విద్యార్ధులు ప్రాణాలు కోల్పోవడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.
ఈ మేరకు కెనడాలోని భారతీయ మిషన్‌లు, ఇండియన్ కమ్యూనిటీతో కేంద్ర విదేశాంగ శాఖ టచ్‌లోకి వెళ్లింది.
ఈ మేరకు ఎంఈఏ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.కెనడాలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలలో ముగ్గురు భారతీయ విద్యార్ధులు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు.
ఈ విషాదాలపై తాము తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నామని.మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లుగా జైస్వాల్ పేర్కొన్నారు.
ఒట్టావాలోని ఇండియన్ హైకమీషనర్, టొరంటోలోని కాన్సులేట్లు బాధిత కుటుంబాలతో టచ్‌లో ఉన్నట్లు ఆయన వెల్లడించారు.
ఈ ఘటనలపై సమగ్ర విచారణ కోసం స్థానిక అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నామని రణధీర్ జైస్వాల్( Randhir Jaiswal ) తెలిపారు.
కెనడా సహా ఇతర ప్రాంతాల్లో ఉన్న భారతీయ పౌరుల భద్రత, సంక్షేమమే భారత ప్రభుత్వానికి ముఖ్యమన్నారు.
ఒట్టావాలోని భారత హైకమీషన్, కాన్సులేట్లు ( Indian High Commission And Consulates In Ottawa )వారి సంక్షేమం, భద్రత కోసం నిరంతరం స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నాయని జైస్వాల్ చెప్పారు.
"""/" /
విద్వేషపూరిత నేరాలు, హింస కారణంగా కెనడాలో భద్రతా ప్రమాణాలు దిగజారిపోతున్నాయని .
ఈ కారణం చేత భారతీయులు అప్రమత్తంగా ఉండాలని అడ్వైజరీని కూడా జారీ చేసినట్లు ఆయన వెల్లడించారు.
ఏ దేశంలోనూ లేనంత స్థాయిలో భారతీయ విద్యార్ధులు కెనడాలో చదువుకుంటున్నారని , ఇండియన్ కమ్యూనిటీ కూడా అక్కడ చాలా పెద్ద సమూహమని జైస్వాల్ తెలిపారు.
అధికారిక సమాచారం ప్రకారం.కెనడాలో 4.
5 లక్షల మంది భారతీయ విద్యార్ధులు చదువుతున్నారని అంచనా . """/" /
కాగా.
ఈ నెల ప్రారంభంలో పంజాబ్‌కు చెందిన గురాసిస్ సింగ్( Gurassis Singh ) తన రూమ్ మెట్ చేతిలోనే హత్యకు గురయ్యాడు.
ఆ తర్వాత డిసెంబర్ 6న సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తోన్న హర్షదీప్ సింగ్‌ను ఓ ముఠా దారుణంగా కాల్చి చంపింది.
ఆ తర్వాతి రోజే పంజాబ్‌కే చెందిన రితిక్ రాజ్‌పుత్‌పై చెట్టు కూలిపోవడంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు.
వరుస ఘటనలతో కెనడాలోని భారతీయ కమ్యూనిటీ బిక్కుబిక్కుమంటూ గడుపుతోంది.
బిగ్ బాస్ 8 ఫినాలేలో సందడి చేసిన రామ్ చరణ్… రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?