హైదరాబాద్ బంజారాహిల్స్ లో మూడు కార్లు దగ్ధం..!!
TeluguStop.com
హైదరాబాద్ లో( Hyderabad ) మూడు కార్లు దగ్ధమైన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది.
బంజారాహిల్స్ రోడ్ నంబర్ 4 లో( Banjara Hills Road No -4 ) మూడు కార్లు అగ్నికి ఆహుతి అయ్యాయని తెలుస్తోంది.
ఒక్కసారిగా కార్లు( Cars ) మంటల్లో చిక్కుకోవడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
"""/" /
అయితే పార్క్ చేసిన కారును స్టార్ట్ చేస్తుండగా మంటలు ఎగిసిపడ్డాయని పోలీసులు తెలిపారు.
ఈ మంటల్లో మొత్తం మూడు కార్లు కాలి బూడిదయ్యాయి.స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
దీంతో పెను ప్రమాదం తప్పింది.
టీసీ ప్రాంక్: వామ్మో ఇంతమంది టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నారా..??