బీజేపీ నాలుగో జాబితాలో ముగ్గురికి స్థానం…!
TeluguStop.com
నల్లగొండ జిల్లా: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం 12 మంది అభ్యర్థులతో బీజేపీ నాలుగో జాబితా విడుదల చేసింది.
ఒకటో జాబితాలో 52 మంది, రెండో జాబితాలో ఒక్కరు, మూడో జాబితాలో 35 మంది, నాలుగోవ జాబితాలో 12 మంది అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది.
దీనితో రాష్ట్ర వ్యాప్తంగా వంద మంది అభ్యర్థులను ఖరారు చేసినట్లైంది.నాలుగో జాబితాలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ముగ్గురికి అవకాశం దక్కింది.
మిర్యాలగూడ నుండి శేడినేని శ్రీనివాస్, మునుగోడు నుండి చలమల్ల క్రిష్ణారెడ్డి, నకిరేకల్ (ఎస్‌సి) నుండి మొగులయ్యకు స్థానం కల్పించింది.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి5, ఆదివారం 2025