ఎమ్మెల్యే రాజాసింగ్‎కు మరోసారి బెదిరింపు కాల్స్

హైదరాబాద్ లోని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‎కు మరోసారి బెదిరింపు కాల్స్ వచ్చినట్లు తెలుస్తోంది.

చంపేస్తామని గత నాలుగు, ఐదు రోజులుగా వరుస మెసేజ్ లు వస్తున్నాయని ఎమ్మెల్యే తెలిపారు.

తనకు బెదిరింపు కాల్స్, మెసేజ్ లు చేస్తున్న వారిని వెంటనే అరెస్ట్ చేయాలని రాజాసింగ్‎ కోరారు.

తనకు ప్రాణహాని ఉందన్న పట్టించుకోవడం లేదని తెలిపారు.ఈ నేపథ్యంలో రాత పూర్వక ఫిర్యాదు చేసినా డీజీపీ పట్టించుకోవడం లేదని ఆరోపించారు.