రాహుల్ గాంధీపై దాడి జరుగుతుందా..?
TeluguStop.com
దేశం కోసం అంటూ కాంగ్రస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ జోడో యాత్ర ప్రారంభించారు.
కన్యాకుమారి నుంచి మొదలైన ఆయన యాత్ర కశ్మీర్ వరకూ సాగనుంది.అయితే.
ఆయన కశ్మీర్ వెళ్లేలోపే దాడి జరిగే అవకాశం ఉందని ఇంటిలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి.
అయితే అవి ప్రీ ప్లాన్ గా జరుగుతుందా.? లేక కశ్మీర్ తీవ్రవాదుల నుంచి ప్రమాదం ఉందా అనేదానిపై ఆరా తీస్తున్నారు.
ఢిల్లీలో ఇప్పటికే వందసార్లు ఆయన ప్రోటోకాల్ ను ఉల్లంఘించారని సెక్యూరిటీ కండీషన్లను పట్టించుకోలేదని అధికారులు చెబుతున్నారు.
అయితే కాంగ్రెస్ మాత్రం సెక్యూరిటీ కల్పించడంలో విఫలం అయిందని దుమ్మెత్తిపోస్తోంది.కాంగ్రెస్ పార్టీ మాత్రం రాహుల్ పై దాడి జరిగే అవకాశం ఉందని ముందునుంచే చెప్తుండటం.
ప్రస్తుతం పలు అనుమానాలకు దారి తీస్తోంది.అంతే కాకండా జనాల్లో పబ్లిసిటీ ఒకే సారి రావడానికి గల ఏకైక మార్గం అదే కావడంతో.
అంతా రాహుల్ పై దాడి జరిగే చాన్స్ ఉందని చెబుతున్నారు.ఈ దాడి కశ్మీర్ లో కాకుండా.
పంజాబ్, హర్యానాలలో జరిగే అవకాశం కనిపిస్తోంది. """/"/
కశ్మీర్ లాంటి చోట కట్టుదిట్టమైన భద్రత ఉండటంతో అక్కడ చాన్స్ చాలా తక్కువగా ఉంది.
రాహుల్ పై నిజంగా దాడి జరిగితే.దాని ప్రభావం దేశ వ్యాప్తంగా ఉండటంతో.
బీజేపీ సైతం కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తోంది.కాంగ్రెస్ సైతం ఒక బలమైన కారణం కోసం చూస్తున్నట్టు కనిపిస్తోంది.
ఇప్పటికైతే రాహుల్ యాత్ర దాదాపు విజయవంతఃం అయినట్టే కనిపిస్తోంది.మరి అది నిజంగా సక్సెస్ అయిందా లేదా అనేది లోక్ సభ ఎన్నికలు వస్తే గానీ తెలియదు.
ఏపీలో జగన్ పైనా, పశ్చిమ బెంగాల్ లో మమత బెనర్జీ పైనా ఈ దాడి ఫార్ములా బాగానే పనిచేసింది.
దాంతో అదే ఫార్ములాను కాంగ్రెస్ నేతలు వాడతారా అని అనుమానాలు సైతం వస్తున్నాయి.